Begin typing your search above and press return to search.
'సావిత్రి'గా మంచు వారసురాలు?
By: Tupaki Desk | 7 Aug 2017 2:14 PM GMTప్రస్తుతం చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా, వేరే రంగాల వారు కూడా తమ రంగుల కలలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. డబ్బు, ఇమేజ్ రెండూ తెచ్చిపెట్టే గ్లామర్ ఫీల్డ్ లో తమ లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. అందులోనూ టాలీవుడ్ లో వారసత్వంగా కొంతమంది సినీరంగ ప్రవేశం చేయడం మామూలే. అందుకే టాలీవుడ్ లో వారసుల హవా ఎక్కువ. అదే తరహాలో మోహన్ బాబు వారసత్వాన్నిఆయన ఇద్దరు కుమారులు - కూతురు సినీరంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణను టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. పూర్తిగా మూడేళ్లు కూడా నిడని విద్యా నిర్వాణ తెరంగేట్రానికి మంచు లక్ష్మి ఏర్పాట్లు చేస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథతో త్వరలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నిర్వాణ నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి స్వయంగా వెల్లడించింది.
వైజయంతీ మూవీస్ బేనర్లో స్వప్న దత్ - ప్రియాంక దత్ ‘మహానటి’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. స్వప్న భర్త నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నిర్వాణ నటిస్తే బాగుంటుందని మంచు లక్ష్మి అనుకుంది. సావిత్రి లాంటి మహా నటి జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమాలో తన కూతురు నటిస్తే గొప్పగా ఉంటుందని ఆమె ఆలోచన. ఆ పాత్రను తన కూతురికే ఇవ్వమని తన ఫ్రెండ్స్ అయిన స్వప్న, ప్రియాంకలను కోరినట్లు లక్ష్మి చెప్పింది.