Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి రంగంలోకి దిగింది!

By:  Tupaki Desk   |   24 May 2015 1:30 AM GMT
మంచు లక్ష్మి రంగంలోకి దిగింది!
X
సినిమా తీయడం ఒకెత్తైతే, దాన్ని ప్రమోషన్‌ చేసుకోవడం మరో ఎత్తు. ఎంత మంచి సినిమా తీసినా దానికి సరైన ప్రమోషన్‌ యాడ్‌ అవ్వకపోతే వృథానే. కానీ ఆ విషయంలో మన టాలీవుడ్‌ వెనకబడిపోయింది. ప్రమోషన్‌ అనగానే రెండు ప్రెస్‌మీట్లు, రెండు డిస్క్‌ ఫంక్షన్లు అన్న చందంగా మారింది. బాలీవుడ్‌లో ఇన్నొవేటివ్‌ థాట్స్‌తో రకరకాల ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. దీంతో మామూలు సినిమాలు సైతం మంచి వసూళ్లను సొంతం చేసుకొంటుంటాయి. మన ఇండస్ట్రీలో ప్రమోషన్‌ విషయానికొస్తే మంచు కుటుంబానికి తిరుగులేదు. వాళ్లు ఏదో రకంగా తమ సినిమాల్ని ప్రమోట్‌ చేస్తుంటారు. అయితే లక్ష్మీప్రసన్న మాత్రం ఇటీవల తన సినిమాల్ని ఆశించిన స్థాయిలో ప్రమోట్‌ చేసుకోలేకపోయింది. అందుకు కారణం తమ్ముడు మనోజ్‌ పెళ్లి సందడి.

మనోజ్‌ పెళ్లి పనులతో నెల రోజులుగా తీరిక లేకుండా గడిపింది లక్ష్మీప్రసన్న. తాను నటించిన 'బుడుగు', 'దొంగాట' సినిమాల్ని సైతం పక్కనపెట్టి పెళ్లి పనులు చూసుకొంది. దీంతో లక్ష్మీప్రసన్న స్వయంగా నిర్మించిన 'దొంగాట'కి పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చినా సరైన ప్రమోషన్‌ లేకపోవడంతో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. అయితే పెళ్లి సందడి పూర్తవ్వగానే వెంటనే మళ్లీ రంగంలోకి దిగింది లక్ష్మీప్రసన్న. ఈరోజు తన తండ్రితోకలిసి 'దొంగాట' సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఇటీవల చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాకపోవడం, తన 'దొంగాట' ఇంకా అక్కడక్కడ థియేటర్లలో ఉండటం మూలాన కాస్త కూస్తో ప్రమోషన్‌ చేస్తే సినిమాకి మేలు జరుగుతుందేమో అని ఆశపడుతోంది లక్ష్మీప్రసన్న. అందుకే రెండు రోజులు హడావుడి చేయాలని నిర్ణయించుకొంది. మరి ఆమె లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.