Begin typing your search above and press return to search.

డబ్బులు లేవంటున్న మంచు లక్ష్మి

By:  Tupaki Desk   |   8 March 2017 7:44 AM GMT
డబ్బులు లేవంటున్న మంచు లక్ష్మి
X
మంచు లక్ష్మి ప్రస్తుతం లక్ష్మీ బాంబ్ మూవీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటోంది. ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. అందులోనూ తనే లీడ్ రోల్ చేయడం.. పైగా తన పేరు మీదే ఈ సినిమా ఉండడంతో.. వీలైనంతగా ప్రచారం చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మంచు లక్ష్మి. అయితే.. ఈ మధ్య సినిమా నిర్మాణంలో ఈమె స్లో అయిపోయిన మాట వాస్తవమే.

గతంలో వరుసగా సినిమాలు చేసేసేవాళ్లు మంచు వారసులు. దాదాపుగా వీరు తీసే సినిమాలు సొంత ప్రొడక్షన్ లోనే ఉండేవి. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ కు బోలెడంత గుర్తింపు ఉండడంతో.. అది వాల్యూ ఎడిషన్ అయ్యేది. అయితే.. కొంతకాలంగా సినిమా నిర్మాణం చేయడం లేదు. ఇందుకు కారణం చెప్పింది మంచు లక్ష్మి. గతంలో తాను తీసిన వన్నీ స్టోరీ బేస్డ్ మూవీస్ అన్న ఆమె.. ఇప్పుడు అయితే డబ్బుల్లేకపోవడంతోనే సినిమాలు తీయడం లేదని అంటోంది. ప్రస్తుతం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా సినిమాలు తీయలేకపోతున్నట్లు చెప్పిందామె.

మంచి కంటెంట్ ఉన్న కథ దొరికితే.. అప్పుడు మళ్లీ సొంత నిర్మాణంలో సినిమా తీస్తానని చెప్పిందామె. అయితే.. మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అంటారు సినీ జనాలు. అలాంటిది హఠాత్తుగా తన దగ్గర డబ్బుల్లేవని మంచు లక్ష్మి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఇంటర్వ్యూలో.. డీమానిటైజేషన్ ప్రభావమా అనే ప్రశ్న ఎదురైతే.. తానెప్పుడూ చెక్ లు మాత్రమే తీసుకుంటానని.. అలాగే పేమెంట్స్ కూడా చెక్ ఫార్మాట్ లోనే చేస్తానని తెగేసి చెప్పింది మంచు లక్ష్మి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/