Begin typing your search above and press return to search.
ఇవాంక ముంగిట మంచు లక్ష్మి స్పీచ్
By: Tupaki Desk | 27 Nov 2017 8:07 AM GMTఅబ్బే ఇదేదో మనం రెగ్యులర్ గా యుట్యూబ్ లో చూసే మరో మీమ్ కాదండోయ్. ప్రస్తుతం మన స్టార్ మంచు లక్ష్మి పిఆర్ టీమ్ ఈ విషయాన్ని తెగ పాపులర్ చేస్తోంది. నిజానికి హైదారాబాద్ లో జరిగినే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్షిప్ సదస్సుకు ఎవరు వస్తున్నారో రారో తెలియదు కాని.. ఎవరి పిఆర్ ఏజన్సీలు వారి స్టార్ లు వస్తున్నారంటూ పాపులర్ చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో లక్ష్మీమంచు వంతొచ్చింది.
ఇప్పుడు తాజాగా అందిని అప్డేట్ ఏంటంటే.. #GES2017లో అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న వేళ.. ఆమె అధ్యక్షతన జరిగే ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడటానికి లక్ష్మీ మంచును పిలిచారట. ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి ప్యానలిస్ట్ గా వెళ్లే మంచు లక్ష్మి.. అక్కడ ఇవాంక ముంగిట స్పీచ్ ఇస్తోంది అంటున్నారు పిఆర్ వర్గాలు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మాత్రం.. సదస్సు జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇప్పటికే అసలు టాలీవుడ్ నుండి ఎవ్వరినీ పిలవవట్లేదు అనుకున్నవేళ.. రామ్ చరణ్ పేరు వినిపించింది. మళ్ళీ చరణ్ రావట్లేదని మరో న్యూస్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా లక్ష్మీ మంచు ఆ కార్యక్రమానికి వెళుతోంది అంటున్నారు. అయితే బిజెపి గవర్నమెంటుతో సత్సంబంధాలు మెయిన్టయిన్ చేస్తున్న మంచు ఫ్యామిలీ.. ఆ మధ్యన నరేంద్ర మోడీని కలవడం.. అలాగే మోడీ మహిళా దినోత్సవం నాడు ట్విట్టర్లో ఫాలో అయిన దేశ మహిళల్లో మంచు లక్ష్మీ కూడా ఉండటం.. ఆమెను పిలిచే ఉంటారు అనే వాదనను బలపరుస్తున్నాయి.