Begin typing your search above and press return to search.

మంచి పని కోసం మంచు లక్ష్మి తపన

By:  Tupaki Desk   |   4 Oct 2015 7:30 AM GMT
మంచి పని కోసం మంచు లక్ష్మి తపన
X
సమాజం మనకేమిచ్చింది అనే కంటే.. సమాజానికి మనం ఏమిచ్చాం అన్నది చాలా ముఖ్యం. ఈ మాట చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు కానీ.. చేసే వాళ్లు మాత్రం చాలా తక్కువ. కానీ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి అలా కాదు. చెప్పకుండానే చేసేస్తుంటుంది. సమాజంలో మార్పు కోసం తనకు చేతనైనంతలో ప్రయత్నిస్తుంది. ఎవరైనా కార్యక్రమం ఏర్పాటు చేసినా.. వారికి మద్దతుగా నిలుస్తుంది.

తాజాగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీఓ.. ఖుషీ నిధుల సేకరణ కార్యక్రమానికి హాజరైన మంచు లక్ష్మీ.. మరో పెద్ద ఛారిటీ కార్యక్రమాన్ని లీడ్ చేయబోతోంది. హైద్రాబాద్ లోని వెస్టిన్ - షెరటాన్ హోటల్స్ నిర్వహిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి గుడ్ విల్ అంబాసిడర్ గా మంచు లక్ష్మి వ్యవహరిస్తోంది. ఈ సంస్థ త్వరలో 8కే రన్ నిర్వహించనుంది.

డబ్బున్నవాళ్లు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తారని.. కానీ పేదవారు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారంటోంది మంచు లక్ష్మి. అయితే వీటిలో వసతులు, సౌకర్యాలు ఏమాత్రం ఉడడం లేదని, అన్నీ ప్రభుత్వమే చేయాలని ఎదురుచూసేందుకు బదులుగా... కొన్ని మనం కూడా చేయాలంటోంది మంచు లక్ష్మి. సమాజానికి మనం ఏదో ఒకటి తిరిగివ్వాల్సిందే అంటూ ఆదర్శంగా నిలుస్తోంది. అక్టోబర్ 11న 8కే రన్ కార్యక్రమం వెస్టిన్ హోటల్ నుంచి ప్రారంభం కానుంది. షెరటాన్ హోటల్ లో హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తో ఈ ప్రోగ్రాం కంక్లూడ్ అవుతుంది.