Begin typing your search above and press return to search.

పండుగ వేళ.. కేటీఆర్ కు మంచు మెసేజ్

By:  Tupaki Desk   |   15 Jan 2017 8:07 AM GMT
పండుగ వేళ.. కేటీఆర్ కు మంచు మెసేజ్
X
పండుగవేళ మంచు లక్ష్మి కాస్త భిన్నంగా వ్యవహరించారు. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెప్పటమే కాదు.. పనిలో పనిగా ఒక మంచి కాజ్ ను పంచుకున్నారు. అదే సమయంలో.. మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించేలా నాలుగు మాటల్ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మధ్యన చేనేత వస్త్రాల్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఏదో మాట వరుసకు అన్నట్లు కాకుండా.. తెలంగాణ రాష్ట్ర అధికారులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాల్ని ధరించాలన్న పిలుపును ఆయన ఇచ్చారు.

అంతేనా.. పలువురు సెలబ్రిటీలను కోట్ చేస్తూ.. చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేయాలని కోరారు. ఈ క్రమంలో కాస్త ఆలస్యంగా అయినా.. మొదట రియాక్ట్ అయిన వారిగా అక్కినేని నాగార్జున దంపతులు నిలిచారు. చేనేత వస్త్రాల్ని ధరించిన వారు ప్రత్యేకంగా ఒక ఫోటో దిగి మరీ.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. చేనేతకు చేయూతనివ్వాల్సిందిగా కోరారు.

నాగ్ మెసేజ్ తో.. మిగిలిన సెలబ్రిటీలు వరుస కడతారని.. చేనేతను ప్రోత్సహించేలా రియాక్ట్ అవుతారని అనుకున్నా.. ఎవరూ కాలేదు. ఆ కొరతను తీరుస్తూ.. పండుగ వేళ.. మంచు లక్ష్మి.. తన తండ్రి మోహన్ బాబు.. తన కుమార్తెతో కలిసి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసేలా ట్వీట్ చేయటమే కాదు.. ఫోటోను కూడా జత చేశారు. మొత్తానికి పండగ వేళ శుభాకాంక్షలతో సరిపెట్టకుండా.. సరికొత్త తరహాలో మెసేజ్ ను మంచు లక్ష్మి ఇచ్చారని చెప్పాలి.