Begin typing your search above and press return to search.
డాడీకి కూడా బొకే ఇస్తారా?
By: Tupaki Desk | 22 Nov 2017 4:57 PM GMTఏదైనా ప్రత్యేక సందర్భాలలో తమ సన్నిహితులకు.. ఆప్తులకు.. పరిచయస్తులకు బొకే ఇచ్చి విషెస్ చెప్పడం సహజంగా చూస్తూనే ఉంటాం. సెలబ్రిటీ కల్చర్ లో అయితే.. పలకరింపులకు కూడా బొకేలు పట్టుకెళ్లిపోతుంటారు. పుట్టిన రోజు నుంచి రకరకాల ఫంక్షన్స్ వరకూ అనేక సందర్భాలలో ఈ బొకేలు ఉపయోగపడుతుంటాయి. కాకపోతే ఇలా బొకేలు ఇవ్వడం బయటి వ్యక్తులకే కనిపిస్తుంది.
కానీ ఇప్పుడు మంచు లక్ష్మి.. తన తండ్రికి కూడా బొకే ఇచ్చి విషెస్ చెప్పి ఆశ్చర్యపరిచింది. మంచు మోహన్ బాబు నటించిన తొలి చిత్రం రిలీజ్ అయ్యి.. ఇప్పటికి 42 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇండస్ట్రీలో ఇంత సుదీర్ఘకాలం ఉండడం.. క్రేజ్ ను కంటిన్యూ చేయగలగడం ఓ రికార్డ్ అని చెప్పాలి. మోహన్ బాబుకు ఈ సందర్భంగా అనేక మంది విషెస్ చెబుతున్నారు. స్వయంగా కలిసి అభినందనలు తెలిపేవారు కొందరైతే.. సోషల్ మీడియా చెప్పేవారు మరికొంతమంది. కానీ మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి మాత్రం.. ఓ పెద్ద బొకే ఇచ్చి తండ్రికి విషెస్ చెప్పింది.
అలా చెబుతున్న ఫోటోను నెట్ లో షేర్ చేసిన మంచు లక్ష్మి.. ఇంతలోనే 42 ఏళ్లు గడిచిపోయాయా అంటూ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇక మంచు లక్ష్మి అంటే తండ్రి మోహన్ బాబుకు ఎంతటి ఇష్టమో చెప్పాల్సిన పని లేదు. ఆమెను అదృష్ట లక్ష్మిగా భావించే మోహన్ బాబు.. ఆమె పేరుపైనే లక్ష్మీప్రసన్న పిక్చర్స్ అంటూ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.. అనేక చిత్రాలను నిర్మించారు.