Begin typing your search above and press return to search.

రాకింగ్ స్టార్ లేదు.. తొక్కలో స్టార్ లేదు

By:  Tupaki Desk   |   5 Nov 2017 7:10 AM GMT
రాకింగ్ స్టార్ లేదు.. తొక్కలో స్టార్ లేదు
X
మంచు మనోజ్ ను అభిమానులు రాకింగ్ స్టార్ అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకు సంబంధించి తాను రాకింగ్ స్టార్ కాదని మనోజ్ అన్నాడు. ఈ సినిమాలో ఏ బ్యాగేజ్ లేకుండా.. ఇమేజ్ లేకుండా ఒక మామూలు ఆర్టిస్టుగా నటించానని అతను చెప్పాడు.

‘‘ఒక్కడు మిగిలాడు ఎందుకు చూడాలి అంటే కొన్ని కారణాలు చెబుతా. ఇది ఎవరినైనా కదిలించే వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన సినిమా. ఇందులో అద్భుతమైన పెర్ఫామెన్సెస్ ఉన్నాయి. అందరూ అద్భుతంగా చేశారు. ఇక ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టానికి సినిమా చూడాలి. ఈ సినిమా చేస్తుండగా దర్శకుడు అజయ్ నూతక్కికి పక్కటెముక విరిగి ఐసీయూలో చేరారు. జెన్నిఫర్ అనే అమ్మాయికి కూడా సీరియస్ అయింది. సముద్రంలో షూటింగ్ చేస్తుండగా ఆమెకు ప్రాణాపాయం తలెత్తింది. దీన్ని బట్టి ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

ఇక నా విషయానికి వస్తే.. రాకింగ్ స్టార్.. తొక్కలో స్టార్.. ఇలాంటివేమీ లేవు. మామూలు ఆర్టిస్టుగా ఇందులో నటించాను. ఈ సినిమా కోసం దర్శకుడు బరువు పెరగమన్నారు. ఐతే నాకు భుజానికి.. మెడకు గాయాలున్నాయి. నా కండరాలు టైట్ గా ఉన్నపుడు నొప్పి ఉండదు. కానీ లూజ్ అయ్యాయంటే నొప్పి మొదలవుతుంది. అదే విషయం చెప్పాను. అయినా పర్లేదని దర్శకుడు చెప్పినట్లు చేయడానికి రెడీ అయ్యాను. కానీ ఒకసారి బరువు పెరిగాక ఎక్కడ తగ్గుతాం. బొక్కలో తగ్గుతాం. చాలా కష్టమైంది’’ అని మనోజ్ అన్నాడు.