Begin typing your search above and press return to search.
మంచు మనోజ్ మూవీ టైటిల్ ఇదే
By: Tupaki Desk | 13 Feb 2020 5:15 AM GMTమంచు మనోజ్ అన్ని రకాల డైలమాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. ఇకపై నటించను.. సినిమాలు విరమించాను! అని ప్రకటించిన మనోజ్.. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో మనసు మార్చుకోవడం రకరకాల డైలమాల గురించి తెలిసిందే. అటుపై వ్యక్తిగత జీవితంలో డిస్ట్రబెన్సెస్ నుంచి బయటపడి రెట్టించిన ఉత్సాహంతో తనని తాను సిద్ధం చేసుకున్నాడు. ఆ క్రమంలోనే 2019 ఎండింగ్ లో అతడి నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. మనోజ్ సొంతంగా ఒక బ్యానర్ ప్రారంభించి అందులో నటించేందుకు రెడీ అవుతున్నానని ప్రకటించాడు. ఎంఎం ఆర్ట్స్ అంటూ గత దీపావళి కానుకగా బ్యానర్ టైటిల్ లోగోని ఆవిష్కరించాడు.
ఈ బ్యానర్ లో కొత్త ట్యాలెంటుకు కావాల్సినంత ప్రోత్సాహం ఉంటుందని మనోజ్ పిలుపునిచ్చాడు. క్రియేటివిటీ ఉన్నవాళ్లు తనని కలవొచ్చని అన్నాడు. అలాగే ఎంఎం ఆర్ట్స్ లో తాను నటించే తొలి సినిమాని ప్రకటించాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేశాడు మనోజ్. `అహం బ్రహ్మస్మి` అంటూ పవర్ ఫుల్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నాడు. టైటిల్ లోగో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిందనే చెప్పాలి. మార్చి 6 న సినిమా ప్రారంభం కానుంది. విద్యా నిర్వాణ మంచు ఆనంద్ సమర్పణలో నిర్మలాదేవి- మంచు మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మనోజ్ తిరిగి హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. పునరారంగేట్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తున్నాడు. ``నా తొలి సినిమాకి ఎలా ఫీలయ్యానో అదే ఎమోషన్ ఇప్పటికీ ఉంది. మీ అందరి సపోర్టుకి ధన్యవాదాలు. ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ సపోర్టుకు థాంక్స్. ఏదైతే కళను నా లైఫ్ అనుకున్నానో దానిని ఇన్నాళ్లు మిస్సయ్యాను. ఇక ఇప్పటికి వచ్చేశాను!`` అంటూ మనోజ్ ఎగ్జయిటింగ్ గా కొత్త సినిమాని ప్రకటించారు.