Begin typing your search above and press return to search.

ప్రగ్యా గాళ్‌ ఫ్రెండ్.. తేజ్ ప్రాణ స్నేహితుడు

By:  Tupaki Desk   |   18 Sep 2016 5:43 AM GMT
ప్రగ్యా గాళ్‌ ఫ్రెండ్.. తేజ్ ప్రాణ స్నేహితుడు
X
ప్రగ్యా గాళ్‌ ఫ్రెండ్.. తేజ్ ప్రాణ స్నేహితుడు. ఈ రెండు వేరువేరు స్టేట్మెంట్స్ అండీ. కలిపి చదివేసి అపార్ధం చేసుకోకోండే. మంచు మోహన్ బాబు సినీ రంగ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. విశాఖలో ఎంబీ40 సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో మోహన్ బాబు వారసులు ముగ్గురూ ప్రత్యేకంగా నిలిచారు. ఈ ఫంక్షన్ నిర్వహణ కోసం తన బిడ్డలు ముగ్గురూ ఎంత కష్టపడ్డారో పేరుపేరునా చెప్పారు మోహన్ బాబు. తమ తండ్రికి జరుగుతున్న అమూల్యమైన పండుగసు సక్సెస్ చేసేందుకు వారంతా బాగా కష్టపడ్డారు.

మిగతావాళ్ల సంగతేమో కానీ.. మంచు మనోజ్ కుమార్ అయితే.. అటు తండ్రికి సాయం చేస్తూనే.. ఇటు అల్లరి కూడా చేసేస్తూ ప్రత్యేకంగా కనిపించాడు. ఓ సమయంలో అయితే.. ప్రగ్యా జైస్వాల్ ని తన గాళ్ ఫ్రెండ్ అని సభాముఖంగా అనేశాడు. ఆమె చేతికి మైక్ ఇచ్చే సందర్భంలో 'నా గాళ్ ఫ్రండ్ ప్రగ్యా మాట్లాడుతుందట' అన్నాడు మనోజ్. ఇక సాయిధరం తేజ్ కి.. మనోజ్ కి ఏ రేంజ్ ఫ్రెండ్ షిప్ ఉందో కూడా.. స్టేజ్ పై కనబడిపోయింది.

'నా చిన్ననాటి స్నేహితుడు.. నా ప్రాణ స్నేహితుడు.. ద సూపర్ రెమెడీ అండ్ అమేజింగ్ స్టార్.. సాయిధరం తేజ్' అన్న మనోజ్.. బాబాయ్ అంటూ తేజు చేతిలో మైక్ పెట్టాడు. ఇదంతా చెబుతున్నంతసేపు.. మనోజ్ ని వాటేసుకుని సాయిధరం తేజ్ వెనక్కు లాగుతున్న సీన్ అదరహో అనాల్సిందే. మెగా- మంచు కుటుంబాల్లో వారసులు ఇంతటి ఫ్రెండ్స్ అనుకున్నారు చాలామంది.