Begin typing your search above and press return to search.
మావాడిది మేనమామ పోలికే`..మనోజ్ ట్వీట్!
By: Tupaki Desk | 23 Nov 2017 11:51 AM GMTటాలీవుడ్ లో కొంతకాలంగా ఓ ఆరోగ్యకరమైన ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది హీరోలు తమ మధ్య ఇగోలు వదిలేసి ఒకరి సినిమాలపై ఒకరు పొగడ్తలు కురిపించేస్తున్నారు. ఒకరి సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు - ఫంక్షన్లకు మరొకరు వెళ్ళి తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రామ్ చరణ్ పై మంచు మనోజ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. "నా సోదరుడు రామ్ చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించినప్పటి నుంచి... అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో - సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. వెంటనే విడుదల చేయండి" అంటూ మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
తాజాగా, మరో మెగా హీరోపై మంచు మనోజ్ ఓ ఇంటరెస్టింగ్ ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ ముఖంలో ఆయన మేనమామ మెగాస్టార్ చిరంజీవి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయంటూ ఓ అభిమాని తేజూ ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశాడు. తేజు హావభావాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే చిరంజీవి కనిపిస్తుంటారని మెసేజ్ చేశాడు. ఆ ట్వీట్ కి తేజూ రిప్లై ఇస్తాడని ఊహించిన అభిమానికి అనూహ్యంగా మంచు మనోజ్ రిప్లై ఇచ్చాడు. "అఫ్ కోర్స్ మా వాడిది వాళ్ల మేనమామ పోలిక ఎక్కడికి పోతుంది?" అంటూ మనోజ్ రిప్లై ఇచ్చాడు. దీంతో, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో, టాలీవుడ్ వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబుల మధ్య `లెజెండ్` వివాదం జరిగిన తర్వాత ఆ రెండు ఫ్యామిలీల మధ్య కొంత గ్యాప్ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కొంతకాలంగా చిరు - మోహన్ బాబులు తటస్థ వేదికలపై కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకోవడం, ఇపుడు చరణ్ - తేజూల పై మనోజ్ క్యూట్ ట్వీట్లు చేయడం చూస్తుంటే ఆ రెండు ఫ్యామిలీలు ఒకటైనట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక మంచి ట్రెండ్ కు శ్రీకారం చుట్టినందుకు మంచు హీరోను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.