Begin typing your search above and press return to search.

షాక్: మంచు మనోజ్ విడాకులు

By:  Tupaki Desk   |   17 Oct 2019 12:21 PM GMT
షాక్: మంచు మనోజ్ విడాకులు
X
తెలుగు హీరో మంచు మనోజ్ కాసేపటి క్రితం తన భార్య ప్రణతి రెడ్డి నుండి విడాకులు తీసుకున్న విషయం వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం "ఒక ఇంపార్టెంట్ మెసేజిని సాయంత్రం ఐదు గంటలకు మీతో షేర్ చేసుకుంటాను" అని వెల్లడించిన మనోజ్ కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా ఒక పెద్ద మెసేజ్ పోస్ట్ చేశారు.

"నా వ్యక్తిగత జీవితానికి.. కెరీర్ కు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. భారమైన హృదయంతో నాకు అధికారికంగా విడాకులు వచ్చాయనే విషయం మీకు తెలియజేస్తున్నాను. దీంతో ఒక అందమైన.. ఎన్నో గుర్తులు ఉన్న మా అనుబంధం ముగిసింది. మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి.. ఇద్దరం చాలా బాధను అనుభవించాం. ఎంతో అలోచించిన మీదట.. విడిగా బ్రతకాలని నిర్ణయించుకున్నం. మేమిద్దరం ఒకరిని ఒకరు ఎప్పుడూ గౌరవించుకుంటాం. ఈ సందర్భంగా మా ఇద్దరి ప్రైవసీని గౌరవించాలని.. మా నిర్ణయానికి మద్దతునిస్తారని ఆశిస్తున్నాను. అందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను."

"నా మనసు కొంతకాలంగా ప్రశాంతంగా లేకపోవడం వల్ల నేను నా నటనపై.. పనిపై ఏకాగ్రత చూపలేకపోయాను. నా కుటుంబ సభ్యులు.. స్నేహాయ్తులు.. అభిమానుల మద్దతు.. ప్రేమ లేకపోతే ఈ తుఫానును దాటగలిగేవాడిని కాదు. కష్టసమయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ఋణపడి ఉంటాను. త్వరలో నేను నాకెంతో ఇష్టమైన.. చేతనైన పని అయిన సినిమాలపై ఫోకస్ చేస్తాను. అభిమానులను సంతోషపెట్టేప్రయత్నం చేస్తాను" అంటూ తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు.