Begin typing your search above and press return to search.

ప్చ్.. మనోజ్ సైలెంట్ కౌంటర్ వేశాడు

By:  Tupaki Desk   |   6 Jun 2018 3:42 PM IST
ప్చ్.. మనోజ్ సైలెంట్ కౌంటర్ వేశాడు
X
మంచు ఫ్యామిలిలో నిజంగా మోహన్ బాబు తరువాత ఇంకా ఆ స్థాయిలో వారసులు హిట్స్ అందుకోలేకపోతున్నారు. మంచి యాక్టర్స్ అయినప్పటికీ కథల లోపం వల్ల డిజాస్టర్స్ చూస్తున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ కెరీర్ లో ఇంకా సరైన హిట్ అందుకోలేదు. మంచి మాస్ ఫిజిక్ ఉన్నప్పటికీ ఫెయిల్యూర్స్ ని చూస్తున్నాడు. సరైన కథ తగిలితే ఈ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోగలడని చెప్పవచ్చు.

ఇకపోతే చివరగా ఒక్కడున్నాడు సినిమాతో ఫెయిల్యూర్ అందుకున్న మనోజ్ ఇంత వరకు ఒక్క కథను కూడా ఫైనల్ చేయలేదు. అదే విధంగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తో సతమతమవుతున్నాడు అని కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. తన భార్య ప్రణతితో విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న మనోజ్ త్వరలోనే విడాకులు తీసుకోనున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ కి మంచు హీరో మంచి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం మనోజ్ అమెరికాలో ఉన్నాడు. తన భార్యతో కలిసి గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడు.

అయితే తన భార్యతో సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఒక ఫొటోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హ్యాపీగా ఉన్నట్లు రూమర్స్ కౌంటర్ సైలెంట్ గా ఇచ్చేశాడు. ఇక మనోజ్ ఇప్పటివరకు ఎలాంటి కథను ఒకే చేయలేదు. ఒక డిఫెరెంట్ కథ ఏదైనా వస్తే చేయాలనీ అనుకుంటున్నాడు. ఇక మంచు విష్ణు దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి మనోజ్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడో చూడాలి.