Begin typing your search above and press return to search.
ఏంటీ మనోజ్ ఈ ఫ్రస్టేషన్?
By: Tupaki Desk | 1 Feb 2019 6:21 AM GMTమంచు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం పాటు సక్సెస్ కోసం చాలా ప్రయత్నించాడు. పాపం అదృష్టం కలిసి రాక పోవడమో లేక మరేంటో కాని మనోజ్ కు మంచి సాలిడ్ సక్సెస్ పడలేదు. దాంతో మనోజ్ సినిమాల సంఖ్య తగ్గించాడు. ఈమద్య కాలంలో అసలు కొత్త సినిమాలే మొదలు పెట్టడం లేదు. రాజకీయాలు - సమాజ సేవ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. సినిమాల విషయాలే కాకుండా పలు విషయాలపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను చెప్పే మంచు మనోజ్ తాజాగా ఒక ట్వీట్ చేసి దాన్ని డిలీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
కియా మోటర్స్ సంస్థ అనంతపురం జిల్లాలో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసి - మొదటి కారును తయారు చేయడం గర్వకారణంగా ఉంది. కియా మోటర్స్ ను ఏపీకి తీసుకు వచ్చినందుకు ఏపీ ప్రభుత్వంను అభినందిస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు. దాంతో పాటు రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందంటూ కూడా మనోజ్ పేర్కొన్నాడు. అయితే కొన్ని నిమిషాలకే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అప్పటికే కొందరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టారు. ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి - మనోజ్ ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ ను డిలీట్ చేయడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నించారు.
ఎవరికైనా భయపడి డిలీట్ చేశారా - లేదంటే ఎవరైనా మీతో బలంవంతంగా డిలీట్ చేయించారా అంటూ ప్రశ్నించారు. దాంతో మనోజ్ స్పందిస్తూ ఆ పోస్ట్ డిలీట్ అయిన విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చింది, ఎలా డిలీట్ అయ్యిందో తనకు తెలియదు అన్నాడు. అయినా నన్ను బెదిరించే వాడు ఎవడు - వాడి డాష్ పగిలి పోద్ది అంటూ మరో ట్వీట్ చేశాడు. రెండవ సారి చేసిన ట్వీట్ ను కూడా మనోజ్ డిలీట్ చేశాడు. ఈసారి ఎందుకు డిలీట్ చేశారంటూ కొందరు ప్రశ్నించగా, కొందరు స్నేహితులు బూతులు వాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే వారి కోసం ఈ సెంకడ్ ట్వీట్ ను డిలీట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇలా వరుసగా మనోజ్ ట్వీట్స్ డిలీట్ చేయడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. దాంతో మరింత ఫ్రస్టేట్ అయిన మనోజ్ నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తా అన్నట్లుగా ట్వీట్ చేశాడు. నేను డబుల్ స్టాండర్డ్స్ తీసుకుంటానంటూ కామెంట్ చేసే వారిని లైట్ తీసుకుంటా - ఆ ఎదవలను వదిలేయండి అంటూ మనోజ్ వరుస ట్వీట్స్ చేశాడు. మనోజ్ ఇంతగా ఫ్రస్టేషన్ కు ఎందుకు గురవుతున్నాడో అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అతి త్వరలో ఒక సంచలన విషయాన్ని చెప్తానంటూ చివరగా మనోజ్ చెప్పడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.