Begin typing your search above and press return to search.
ఎమోషన్ తో కూడిన రియాక్షన్ ఫసక్!
By: Tupaki Desk | 15 Sep 2018 4:57 PM GMTటీవీ ప్రోగ్రామ్ లో మోహన్ బాబు 'ఫసక్' అనే పదం వాడినప్పటినుండి అది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ అయింది. వందల కొద్ది మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇక మోహన్ బాబు కూడా ఈ మీమ్స్ ను చూశానని.. ఎంజాయ్ చేశానని చెప్పడం జరిగింది. ఇక ఫసక్ మీనింగ్ ఏంటి అంటే డిక్షనరీలో దొరకదు. మరి ఎవరు చెప్తారు? ఇదే సమస్య 'సవ్యసాచి' హీరోయిన్ నిధి అగరాల్ కు ఎదురైంది.
దీంతో ట్విట్టర్ ద్వారా "గైస్.. ఈ ఫసక్ ఏంటి? నేను ఈ పదాన్ని చాలా చోట్ల చూస్తున్నాను.. నాకు ఈ పదానికి అర్థం తెలియడం లేదు" అంటూ ట్వీట్ చేసింది. ఇక దీనికి సమాధానం మంచు వారసుడు మనోజ్ ఇచ్చాడు. "ఫసక్ అనేది చాలా ఎమోషన్ తో కూడిన రియాక్షన్. నా ఇంగ్లీష్ తప్పయితే క్షమించు.. అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు.. ఫసాక్!!" ఇక ఈ డైలాగ్ ఏ రాగంలో ఉందో ఏ తాళం లో ఉందో మీకు అర్థం అయింది కదా. మోహన్ బాబు రాగం.. పెదరాయుడు తాళం. ఇక ఈ ట్వీట్ కు అప్పటి నుండి లైకులే లైకులు. తండ్రిని మించిన తనయుడు మాత్రమే ఇలాంటి డైలాగ్ చెప్పగలరు?
ఈ ఫసాక్ ఇంతటితో ఆగలేదు. మనోజ్ వివరణకు "ఇప్పుడు నాకు ఫసాక్ ఎమోషన్ పూర్తిగా అర్థం అయింది" అంటూ నిధి రిప్లై ఇచ్చింది. ఏదేమైనా కానివ్వండి.. తెలుగు భాషలో కొత్తపదాన్ని కనిపెట్టిన ఘనత మంచువారికే సొంతం!