Begin typing your search above and press return to search.

అదేంది మ‌నోజ్‌..గుడ్ బై పోస్ట్ డిలీట్ చేశావ్‌?

By:  Tupaki Desk   |   14 Jun 2017 7:35 AM GMT
అదేంది మ‌నోజ్‌..గుడ్ బై పోస్ట్ డిలీట్ చేశావ్‌?
X
సినిమాలకు గుడ్ బై చెబుతానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ముఖ యువ హీరో మంచు మ‌నోజ్ మ‌రో ఆస‌క్తిక‌రమైన ప‌ని చేశారు. ఉద‌యం తొమ్మిది గంట‌ల ప్రాంతంలో సినిమాల‌కు గుడ్ బై అన్న పోస్ట్ చేసి ఒక్క‌సారి షాక్ ఇచ్చిన ఆయ‌న‌.. ప‌న్నెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలో పోస్ట్‌ ను డిలీట్ చేయ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సినిమాల‌కు గుడ్ బై అని పోస్ట్ పెట్టిన మూడున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న త‌న పోస్ట్‌ ను ఎందుకు డిలీట్ చేశార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సినిమాల‌కు గుడ్ బై చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మంచు మ‌నోజ్ పోస్టింగ్ తో ప‌లు వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి.

ఆయ‌న త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లుగా కొంద‌రు ప్ర‌క‌టిస్తే.. మ‌రికొంద‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల‌తో వార్త‌లు వ‌చ్చేశాయి. ఇదిలా ఉంటే.. వీట‌న్నింటికి భిన్నంగా త‌న పోస్టింగ్ ను సింఫుల్ గా డిలీట్ చేసేసిన మంచు మ‌నోజ్.. జ‌నాల‌ను క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డేశార‌ని చెప్పొచ్చు. ఇంత‌కాలం వార్త‌ల్లో లేని ఆయ‌న కేవ‌లం ఒక్క పోస్టింగ్ తో వార్త‌ల్లోకి రావ‌ట‌మే కాదు.. అదే పోస్ట్ ను డిలీట్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/