Begin typing your search above and press return to search.

మళ్లీ ప్రయాణం చేస్తున్న మనోజ్

By:  Tupaki Desk   |   26 Jan 2018 6:31 AM GMT
మళ్లీ ప్రయాణం చేస్తున్న మనోజ్
X
మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు మనోజ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన హిట్ అందుకోవడం లేదు. ఆ మధ్యలో పోటు గాడు కరెంట్ తీగ అనే సినిమాలతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మళ్లీ ఆ తరువాత వరుస పరాజయలని చూశాడు. హీరోగా తన వర్క్ ని మనోజ్ చాలా కసిగా చేస్తాడు. యాక్షన్ నటనలో చాలా కష్టపడతాడు. ఆ విదంగా చేసిన శౌర్య - ఎటాక్ అండ్ గుంటూరోడు మరియు ఒక్కడు మిగిలాడు సినిమాలు ఏ మాత్రం లాభాన్ని ఇవ్వలేదు.

కథల లోపం వల్ల మనోజ్ డిజాస్టర్స్ అందుకున్నాడు అనేక కామెంట్స్ వినిపించాయి. అలాగే అతని కెరీర్ క్లోజ్ అయినట్టే అనే విదంగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఒక్కడు మిగిలాడు సినిమా రిలీజ్ విషయంలో సినిమా చాలా చేదు అనుభవాలను చూసింది. కనీసం థియేటర్స్ దొరకాలేని పరిస్థితి. అయితే ఈ సారి ఒక కమర్షియల్ హిట్ అందుకోవాలని ఈ హీరో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో తనతో ప్రయాణం అనే సినిమాను చేసిన చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడట. ప్రయాణం సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు.

అలాగే దర్శకుడు చంద్రశేఖర్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తాడు గాని బాక్స్ ఆఫీస్ రేంజ్లో ఇంకా హిట్స్ అందుకోవడం లేదు. గతంలో మనమంతా అనే సినిమా చేశాడు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు. దీంతో ఆ దర్శకుడు కూడా మరో మంచి అందుకోవాలని అనుకుంటున్నాడు. మంచు వారి ప్రొడక్షన్ లొనే ఆ సినిమా ఉంటుందట. త్వరలోనే దర్శకుడు అధికారికంగా సినిమా గురించి తెలుపనున్నాడని సమాచారం.