Begin typing your search above and press return to search.
మంచు మనోజ్ రెండో పెళ్లికి వేళయిందా?
By: Tupaki Desk | 9 Jan 2023 2:53 PM GMTమంచు మనోజ్ 2017 తరువాత సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేసిన `ఒక్కడు మిగిలాడు`లో నటించిన మనోజ్ అప్పటి నుంచి సినిమాలకు దూరంగానే వున్నారు. మధ్యలో `అహం బ్రహ్మస్మి` అనే మూవీని ప్రారంభించినా రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం మొదలు పెట్టకుండా ఆ ప్రాజెక్ట్ ని మొదట్లోనే ఆపేశాడు. రామ్ చరణ్ క్లాప్ తో భారీ హంగామా చేసినా ఆ తరువాత ఎందుకో మనోజ్ సైలెంట్ అయిపోయాడు.
ఇదిలా వుంటే 2019లో వ్యక్తగత కారణాల వల్ల భార్య ప్రణతితో విడిపోయిన మంచు మనోజ్ ఫైనల్ గా ఆమె నుంచి విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత నుంచి మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వరుస కథనాలు వినిపించడం మొదలైంది. రీసెంట్ గా కడప దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచు మనోజ్ త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించాడు. అంతే కాకుండా కొత్తగా సినిమాలు కూడా ప్రారంభించబోతున్నానని వెల్లడించాడు.
దీంతో మంచు మనోజ్ రెండవ పెళ్లిపై మరిన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలైంది. గత కొంత కాలంగా మంచు మనోజ్.. రాయలసీమకు చెందిన దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికతో సన్నిహితంగా వుంటున్నాడని, త్వరలో ఇద్దరకు కలిసి వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన దగ్గరి నుంచి సింగిల్ గా వుంటున్న మంచు మనోజ్ గత కొంత కాలంగా రెండవ పెళ్లి భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికతో ప్రేమలో వున్నారట.
త్వరలో వీరిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. కడప దర్గా ని సందర్శించిన మంచు మనోజ్ తాను త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో మనోజ్ పెళ్లి వార్త నిజమేనని, తను భూమా మౌనికని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై మంచు మనోజ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.