Begin typing your search above and press return to search.

మంచు మనోజ్‌ ఆ 'నవ్వు' తో కన్ఫ్యూజ్ లోకి నెట్టేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   10 Dec 2022 7:20 AM GMT
మంచు మనోజ్‌ ఆ నవ్వు తో కన్ఫ్యూజ్ లోకి నెట్టేస్తున్నాడు!
X
మంచు ఫ్యామిలీ హీరో విష్ణు నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. సక్సెస్ ఫ్లాప్ లతో పట్టింపు లేకుండా విష్ణు సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కానీ మంచు మనోజ్ మాత్రం తన సినిమాల విషయంలో అభిమానులను ప్రేక్షకులను మరియు మీడియా సర్కిల్స్ వారిని కన్ఫ్యూజ్ లోకి నెట్టివేస్తున్నాడు.

ఆ మధ్య తాను సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెబుతున్నట్లుగా పేర్కొని షాక్ ఇచ్చాడు. అయితే ఆ వ్యాఖ్యలు సరదాగా చేసినవి అని.. ఫ్రాంక్ అని ఆ తర్వాత తానే చెప్పాడు. దాదాపుగా అయిదు సంవత్సరాల క్రితం మంచు మనోజ్‌ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన తన సినిమాను విడుదల చేయలేక పోయాడు.

మధ్యలో అహం బ్రహ్మాస్మి సినిమా ను ప్రకటించిన మనోజ్ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ ఇవ్వలేదు. పాన్ ఇండియా సినిమా అన్నట్లుగా ప్రకటించి మొదలు పెట్టిన మంచు మనోజ్ ఇప్పటి వరకు ఆ సినిమా అప్‌డేట్ ఇవ్వక పోవడంతో రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ సినిమా ఉందా లేదా అంటూ అనుమానం ఉన్న సమయంలో జనాలను మరింతగా మనోజ్‌ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.

ఇటీవల మంచు మనోజ్‌ ఒక ఫొటోను షేర్‌ చేసి ఆడియోస్ అమిగో అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు చాలా మంది అహం బ్రహ్మాస్మి సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

ఒక అభిమాని చాలా రోజులుగా అహం బ్రహ్మాస్మి సినిమా గురించి అడుగుతున్నాను. కానీ ఇప్పటి వరకు మీరు చెప్పడం లేదు అంటూ కామెంట్ చేశాడు. దానికి సమాధానం అన్నట్లుగా మనోజ్ స్మైలీ ఈమోజీని షేర్‌ చేశాడు.

దానికి మాత్రమే కాకుండా మరికొన్ని ట్వీట్స్ కు కూడా ఆయన కేవలం స్మైల్‌ ఈమోజీని షేర్ చేశాడు. అహం బ్రహ్మాస్మి సినిమా గురించి అడిగితే ఇలా నవ్వు ఈమోజీ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ నవ్వు తో అహం బ్రహ్మాస్మి గురించి మరింతగా మనోజ్ కన్ఫ్యూజన్ ను క్రియేట్‌ చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.