Begin typing your search above and press return to search.
మనోజ్ అంతపని చేశాడా..!
By: Tupaki Desk | 13 Feb 2016 1:30 PM GMTమంచు మనోజ్ - ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ప్రణతి - మనోజ్ వదిన స్నేహితురాలు. తనను చూసి ఇష్టపడిన మనోజ్, ప్రణతినే పెళ్లి చేసుకోవాలని భావించాడు. దానికోసం ఓ సారి ప్రణతి పెళ్లి చూపులు కూడా చెడగొట్టాడట. ఇదేదో సినిమాలో సీన్ లా ఉంది కదూ..! కాని నిజంగానే మనోజ్ అంతపనే చేశాడు. ప్రేమికుల రోజు సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో మనోజ్ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు.
''ప్రణతి ఒకసారి మా వదినను మీట్ అవ్వడానికి ఇంటికొచ్చింది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నాను. అయితే సరదాగా ఓ రోజు ఫ్రెండ్ తో కలిసి రెస్టారంట్ కు వెళ్లాను. అక్కడ ఒక టేబుల్ లో మా వదిన - ప్రణతి వేరే అబ్బాయితో కూర్చొని ఉన్నారు. విషయం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ దగ్గరకు వెళ్లాను. ప్రణతికి ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేసారని తెలిసింది. దాంతో ఆ పెళ్లి చూపులు ఎలా అయిన క్యాన్సిల్ చేయాలని అక్కడ నుండి అర్జంట్ పనని చెప్పి ప్రణతిని తీసుకువెళ్ళిపోయాను. అప్పటినుండి మా మధ్య మంచి రిలేషన్ మొదలయ్యింది. నాన్నకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆయనకు చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు'' అంటూ తన ప్రేమ విశేషాలను తెలియజేశారు.