Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత దశరథ్‌తోనే

By:  Tupaki Desk   |   10 April 2015 7:36 AM GMT
పెళ్లి తర్వాత దశరథ్‌తోనే
X
మనోజ్‌ .. మంచు కుటుంబంలోనే ఎనర్జిటిక్‌ హీరో. బిందాస్‌ లాంటి కుర్రోడు. తీగలోని కరెంటు లాంటోడు. అందుకే రాంగోపాల్‌ వర్మతో ఎటాక్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగులో బిజీ బిజీ. మరి ఇటీవలే స్నేహితురాలితో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ తీగలోకి కరెంటు ప్రవహించడానికి ఇంకెంతో టైమ్‌ లేదు. త్వరలోనే పెళ్లికి రంగం సిద్ధమవుతోంది. వర్మతో ఎటాక్‌ పూర్తవ్వగానే పెళ్లికి రంగం సిద్ధం. పెళ్లి తదుపరి ప్రణాళికను కూడా ఇప్పట్నుంచే రెడీ చేశాడు.

హనీమూన్‌ లాంటి వార్త ఒకటి పెళ్లికి ముందే వినిపించాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా దశరథ్‌తో ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. సంతోషం, మిస్టర్‌ పెర్ఫెక్ట్‌ లాంటి విజయవంతమైన సినిమాల్ని తెరకెక్కించిన దశరథ్‌ మనోజ్‌తో 'శ్రీ' తెరకెక్కించాడు. ఈ సినిమాతోనే మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా కథానాయికగా పరిచయమైంది. అందుకే ఇప్పుడు ఈ కలయికలో ఓ సినిమాకి రంగం సిద్ధమైంది. కథ రెడీ. దర్శకుడు రెడీ. ఇక పెళ్లి పూర్తవ్వడమే ఆలస్యం. తదుపరి వెంటనే దశరథ్‌తో సెట్స్‌కెళ్లడానికి మనోజ్‌ ఓకే చెప్పేశాడు. అదీ సంగతి.