Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: ఒక్కడుగా వస్తున్న మనోజ్
By: Tupaki Desk | 31 Oct 2016 10:11 AM ISTఈ మధ్య కాలంలో ఒక్కడు టైటిల్ తో సినిమాల కౌంట్ బాగా పెరిగింది. విక్రమ్ ఇంకొక్కడు ఇప్పటికే రిలీజ్ కాగా.. నారా రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు.. ఆర్పీ పట్నాయక్ మనలో ఒకడు.. కిచ్చా సుదీప్ కోటికొక్కడు.. నాని ఎవడో ఒకడు(ఇంకా ఫైనల్ కాలేదు)లు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఒక్కడు టైటిల్ తో ఆకట్టుకుంటున్నాడు. కాకపోతే.. వీటన్నిటి కంటే విభిన్నమైన థీమ్ తో కమర్షియల్ యాంగిల్ నుంచి కాకుండా.. ఓ రియల్ స్టోరీని సినిమాగా మలుస్తున్నాడు మనోజ్.
'ఒక్కడు మిగిలాడు' అనే టైటిల్ పై రూపొందుతున్న చిత్రానికి ఫస్ట్ లుక్ ఇచ్చాడు మనోజ్. చేతిలో ఏకే47 తో.. ఆ చేతిపై ప్రజలను టార్గెట్ చేసిన గన్ పాయింట్ ను చూపిస్తూ.. ఇది ప్రజల కోసం పోరాటం చేసే స్టోరీ అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు అజయ్ ఆండ్రూ నూతక్కి. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో ఈ స్టోరీ ఉండనుండగా.. మనోజ్ పాత్ర ఎల్టీటీఈ కమాండర్.
ఎల్టీటీఈపై బయటి ప్రపంచానికి పెద్దగా తెలీని యాంగిల్ ని చూపించబోతున్నాడట డైరెక్టర్. ఇప్పటికే ఒక్కడు మిగిలాడు చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీలో ఎక్కువభాగం నీటిలోనే షూటింగ్ చేశారట. విజువల్స్ పరంగా ఆడియన్స్ కు ఒక్కడు మిగిలాడు కొత్త అనుభూతులను పంచుతుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/