Begin typing your search above and press return to search.
కులం కళ్లతో సినిమా చూడకండి: మనోజ్
By: Tupaki Desk | 3 March 2016 1:30 PM GMTకులాల గొడవల్ని పెద్దోళ్లకు వదిలేద్దాం.. మనం మాత్రం ప్రేమనే పంచుదాం అంటూ ‘శౌర్య’ ఆడియో ఫంక్షన్ లో మంచి మాట చెప్పాడు మంచు మనోజ్. ఈ సినిమా విడుదల నేపథ్యంలో పెట్టిన ప్రెస్ మీట్ లోనూ మరోసారి మనోజ్ క్యాస్ట ఫీలింగ్ గురించి ప్రస్తావించాడు. ఈ తరం యువత కులాల గురించి ఆలోచించకూడదని.. అలాగే డ్రగ్స్ జోలికి కూడా వెళ్లొద్దని హితవు పలికాడు. అవి రెండూ చాలా ప్రమాదకరమన్నాడు. సినిమాలు చూసేటపుడు కూడా కులాల కోణంలో చూడటం సరికాదన్నారు. కులం కళ్లతో సినిమాలు చూడొద్దని.. అన్ని కులాల వాళ్లూ అందరి సినిమాలు చూడాలని పిలుపునిచ్చాడు.
‘శౌర్య’ తరహా కథలో తానిప్పటిదాకా నటించలేదని.. ఇది తన కెరీర్లో చాలా భిన్నమైన సినిమా అని.. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని మనోజ్ అన్నాడు. అందరూ తమ సినిమా చాలా డిఫరెంటుగా ఉంటుంది అని అంటుంటారని.. కానీ తాను మాత్రం ఈ మాటను రొటీన్ గా చెప్పట్లేదని.. ‘శౌర్య’ నిజంగానే డిఫరెంట్ మూవీ అని.. సినిమా చూశాక ఈ మాట ప్రేక్షకులే చెబుతారని మనోజ్ అన్నాడు. పెళ్లి తర్వాత చాలా మారినట్లున్నారే అని అడిగితే.. ‘‘అదేమీ లేదు. ఇంతకుముందెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా. నిజానికి మా ఆవిడ కొత్తగా ఇప్పుడొచ్చి నన్ను మార్చిందేమీ లేదు. ఎందుకంటే తను నాకు ఐదేళ్లుగా పరిచయం. నేనేంటో తనకు ఎప్పట్నుంచో తెలుసు. ఇప్పుడు ఉన్నట్లుండి వచ్చి మార్చేదేమీ లేదు’’ అని అన్నాడు మనోజ్.