Begin typing your search above and press return to search.

పెళ్లి పీటల మీదకు మంచు మనోజ్.. ఆమె ఎవరంటే?

By:  Tupaki Desk   |   5 Sep 2022 4:26 AM GMT
పెళ్లి పీటల మీదకు మంచు మనోజ్.. ఆమె ఎవరంటే?
X
మంచు ఫ్యామిలీకి సంబంధించి పెద్దగా వార్తల్లో ఉండకుండా.. తనదైన ప్రపంచంలో తాను ఉంటూ.. కాంట్రావర్సీలకు దూరంగా ఉండే వ్యక్తిగా మంచు మనోజ్ ను చెబుతారు. 'మా' ఎన్నికల వేళ.. మనోజ్ వ్యవహరించిన తీరుకు సినీ ప్రముఖులతో పాటు.. ఆ ఎపిసోడ్ ను ఫాలో అయిన వారంతా మెచ్చుకున్న వారే. సినిమాలకు సంబంధించిన విషయాల్ని పక్కన పెడితే.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి చోటు చేసుకుంది.

ఆదివారం రాత్రి వేళలో సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి డివిజన్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి హాజరై పూజలు నిర్వహించారు. నిజానికి ఇదే జరిగితే.. ఇదే మాత్రం వార్త అయ్యేది కాదు. కానీ.. మనోజ్ వెంట.. దివంగత భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రావటం.. ఇరువురు కలిసి పూజలు చేయటం ఆసక్తికరంగా మారింది.

గతంలో మనోజ్ కు పెళ్లి కావటం.. కొంతకాలం అన్యోన్యంగా కనిపించినప్పటికీ.. ఆ తర్వాత విడాకులు తీసుకోవటం అందరిని విస్మయానికి గురి చేసింది. విడాకులు తీసుకొని చాలా కాలమే అయినప్పటికీ సింగిల్ గా ఉన్న మనోజ్.. తాజాగా మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. భూమా మౌనిక తో కలిసి గణేష్ మండపానికి వచ్చి ఇరువురు కలిసి పూజలు చేయటంతో కొత్త చర్చ మొదలైంది.

నిజానికి ఈ పెళ్లికి సంబంధించి గడిచిన కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య చర్చ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబును మనోజ్ తండ్రి.. విలక్షణ నటుడు మోహన్ బాబు కలిసింది కూడా అందుకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

భూమా అఖిలతో కలిసి గణేశ్ మండపానికి వచ్చిన మనోజ్ ను మీడియా ప్రతినిధులు పెళ్లి గురించి అడగ్గా.. నేరుగా సమాదానం ఇవ్వలేదు. త్వరలో ప్రకటన చేస్తానని వ్యాఖ్యానించారే తప్పించి.. మౌనిక గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

మొత్తంగా గణేశ్ మండపటం వద్దకు భూమా మౌనికతో వచ్చిన మనోజ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. మరి.. వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.