Begin typing your search above and press return to search.
విశాఖ ఉక్కుః స్పందించిన హీరో .. ప్రభుత్వంపై ఆగ్రహం!
By: Tupaki Desk | 13 March 2021 7:30 AM GMTవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరో హీరో స్పందించాడు. మంచు మనోజ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్లకు అమ్మడం చాలా పెద్ద అన్యాయమని అన్నారు.
స్టీల్ ప్లాంట్ కొనడానికి ప్రైవేటు సంస్థలు మముందుకు వస్తున్నప్పుడు.. ప్రభుత్వం దాన్ని లాభాల్లో ఎందుకు నడిపించలేకపోతోందని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
తాము హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ.. ఈ విషయంలో చాలా బాధపడుతున్నామని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతీ ఒక్కరి మద్దతు ఉంటుందని అన్నారు మనోజ్.
కాగా.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు సాగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నారా రోహిత్ కూడా ఉద్యమానికి మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే.. మిగిలిన హీరోలు, సెలబ్రిటీలు మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.