Begin typing your search above and press return to search.
శబరిమల ఇష్యూ..నెటిజన్ కు మనోజ్ పంచ్
By: Tupaki Desk | 31 Oct 2018 10:43 AM GMTపవిత్ర శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో పెద్ద ఎత్తున హిందుత్వ వాదులు ఈ తీర్పును వ్యతిరేకించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇప్పటివరకు ఒక్క మహిళను కూడా ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈ వివాదంపై తమిళ అగ్రహీరోలు రజినీకాంత్ - కమల్ హాసన్ కూడా స్పందించారు. కానీ మన తెలుగులో అయ్యప్ప మాల వేసుకునే హీరోలు రాంచరణ్ - మంచు మనోజ్ లాంటి వారు స్పందించలేదు. తాజాగా ఓ నెటిజన్ వీరిద్దరికి ప్రశ్నలు సంధించారు. శబరమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై స్పందించాలని కోరారు.
శివానీ అనే ఓ మహిళ నెటిజన్.. రాంచరణ్ - మంచు మనోజ్ లు అయ్యప్ప దీక్ష ధారులుగా ఉన్నప్పటి ఫొటోలను షేర్ చేసి వాటిని రాంచరణ్ - మంచు మనోజ్ లకు ట్యాగ్ చేసి స్పందించాలని కోరింది.
ఇందుకు మంచు మనోజ్ తాజాగా స్పందించారు.. ‘పేదలకు తిండి - నీరు - చదువు వంటి సౌకర్యాలు అందడం లేదని మేమంతా చింతిస్తున్నాం.. మనం ముందు వాటి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా.. అలాంటప్పుడు ఆయనకు వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు.. మనమంతా మానవత్వం వైపు నిలబడదాం.. లవ్యూ ఆల్’ అని సమాధానమిచ్చాడు. దీంతో ఆ నెటిజన్ దిమ్మదిరిగినంత పని అయ్యింది..