Begin typing your search above and press return to search.
అలా అంటున్న కుక్కల్ని చెప్పుతో కొట్టాల్సిందే!
By: Tupaki Desk | 24 Sep 2018 8:56 AM GMTనల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలను ఒక కుదుపు కుదిపేసిన విషయం తెల్సిందే. ప్రేమించిన పాపానికి ప్రణయ్ ని నడిరోడ్డు మీద నరికి చంపేశారు. పరువు కోసం ప్రణయ్ భార్య అమృత తండ్రి ఈ దారుణంకు ఒడిగట్టిన విషయం తెల్సిందే. పరువు హత్యను అంతా కూడా ఖండిస్తున్న సమయంలో కొందరు మాత్రం సమర్ధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. పరువు హత్యను సమర్థించిన వారిపై సినీ నటుడు మంచు మనోజ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ విషయమై మంచు మనోజ్ మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య విషయంలో అంతా కూడా అయ్యో పాపం అనాల్సింది పోయి కొందరు నీచంగా చంపడంను సమర్థిస్తున్నారు. స్టేటస్ కోసం చంపడం కెరెక్ట్ అంటున్నారు. 10వ తరగతి చదివే పిల్లలకు కులం గురించి ఏం తెలుస్తుందండి - ఆ వయస్సులో ప్రేమ చాలా స్వచ్చమైనది. ఈ విషయమై కొందరు ఫేస్ బుక్ - ట్విట్టర్ లో చేస్తున్న వ్యాఖ్యలకు ఇలాంటి నీచులు ఉన్న సమాజంలో నేను ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను. పరువు హత్యను సమర్ధించే ప్రతి ఒక్క కుక్కని చెప్పుతో కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కులం మతం అనే అడ్డు గోడలను తొలగించడంలో మన విద్యా వ్యవస్థ సఫలం కాలేక పోతుంది. ప్రణయ్ హత్యను సమర్ధిస్తున్న ప్రతి ఒక్కరి పేరును నోట్ చేయాలని - మళ్లీ ఇలాంటి సంఘటనలకు వారు పాల్పడకుండా చూడాలని మనోజ్ కోరుతున్నాడు. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రణయ్ హత్యను ఖండిరచారు. కాని మనోజ్ ను మాత్రం ప్రణయ్ హత్య ఎక్కువగా కదిలించినట్లుగా - బాధ పెట్టినట్లుగా అనిపిస్తుంది.