Begin typing your search above and press return to search.
#RRR : చిరుతో పాటు క్లాప్ కొట్టిన హరికృష్ణ!!
By: Tupaki Desk | 12 Nov 2018 10:53 AM GMTభారీ అంచనాలున్న జక్కన్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రారంభోత్సవం ఎట్టకేలకు లాంచనంగా జరిగింది. సినీ ప్రముఖులు హాజరు అయిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో హరికృష్ణ లేకపోవడం కాస్త నిరాశ కలిగించిన విషయం అంటూ నందమూరి ఫ్యాన్స్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల యాక్సిడెంట్ లో హరికృష్ణ మరణించిన విషయం తెల్సిందే. హరికృష్ణ జీవించి ఉంటే ఖచ్చితంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు అంటూ నందమూరి ఫ్యాన్స్ చర్చ. ఈ సందర్బంగానే నందమూరి అభిమాని ఒకరు ఈ చిత్రం కు చిరంజీవి క్లాప్ కొట్టే ఫొటోలో హరికృష్ణ ఫొటోను జత చేయడం జరిగింది.
ఆ ఫొటో మంచు మనోజ్ కంట పడటం, వెంటనే ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రారంభోత్సవంలో హరికృష్ణ గారు అంటూ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోను జత చేసి మంచు మనోజ్ ట్విట్టర్ లో సో నైస్, చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. మంచు విష్ణు ఈ ఫొటో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ పిక్ వైరల్ అయ్యింది.
‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు ముందు హరికృష్ణ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ బాగా ఎమోషన్ అయ్యారు. నాన్న లేని లోటు ఏ ఒక్కరు తీర్చలేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. హరికృష్ణ చనిపోయిన సమయంలో మంచు మనోజ్ ఎన్టీఆర్ కు చాలా ధైర్యంగా నిలిచిన విషయం తెల్సిందే. తాజాగా మనోజ్ ఈ పిక్ చేయడంతో మరోసారి నందమూరి అభిమానులు అంతా కూడా హరికృష్ణను స్మరించుకుంటున్నారు.