Begin typing your search above and press return to search.
ఈ డల్ ప్రమోషన్లకు కారణం ఏంటో??
By: Tupaki Desk | 2 March 2016 10:30 PM GMTరేపు శుక్రవారం.. అనగా మార్చి 4న.. విడుదలయ్యే సినిమాల్లో ముఖ్యంగా మూడింటి గురించి మనం చెప్పుకోవాలి. నందిని రెడ్డి తీసిన కళ్యాణ వైభోగమే.. ప్రవీణ్ సత్తారు తీసిన గుంటూర్ టాకీస్.. అలాగే దశరథ్ డైరక్షన్ లో వచ్చిన శౌర్య సినిమా.. పెద్ద సినిమాలు అండ్ ప్రముఖ సినిమాలు అనాల్సిందే. అయితే సినిమా రిలీజ్ ఇరగదీసేయాలని అందరూ బాగానే ప్రమోట్ చేయాలి మరి. ఒక పక్కన కళ్యాణ వైభోగమే సినిమాను చితక్కొట్టేస్తున్నారు. నందిని ప్రమోషన్లు బాగానే చేస్తోంది. ఇంకో ప్రక్కన గుంటూర్ టాకీస్ టీమ్ కూడా బాగా యాక్టివ్ గా ఉంది. తెగ ప్రమోట్ చేస్తున్నారు. మధ్యలో శౌర్య ఎక్కడ మరి?
కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టి.. మీడియాకు పెద్దమ్మ గుడిలో లంచ్ ఏర్పాటు చేయడం తప్పించి.. అసలు ''శౌర్య'' సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్లే చేయట్లేదు. కేవలం ఓ రెండు పెద్ద పెద్ద టివి ఛానళ్లలోనే ఇంటర్యూలు ఇచ్చారంతే. రిలీజ్ డేట్ వచ్చేస్తోంది అనే హడావుడి కూడా ఏం లేదు. మరి ఇంత డల్ ప్రమోషన్ చేయడానికి కారణం ఏంటి? అబ్బే.. సినిమాలోని కంటెంట్ మీద అంత నమ్మకం ఉందట. కేవలం రిలీజ్ అయ్యే ధియేటర్లలో వచ్చే ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ చాలంట.. సినిమాకు విపరీతమైన టాక్ అండ్ కలెక్షన్లు వచ్చేయడానికి. అందుకే ప్రమోషన్లన్నీ సినిమా రిలీజ్ అయ్యాక చేస్తారట. చూద్దాం వీళ్ల స్ర్టాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో. తేడాపడితే.. అనవసరంగా ఓపెనింగులు కూడా రావు మరి.