Begin typing your search above and press return to search.
మంచు మనోజ్ రాజకీయాల్లోకి!?
By: Tupaki Desk | 22 Oct 2018 4:55 AM GMTమంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో తాను ఇక నటించబోనని అప్పట్లో సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన అనంతరం తండ్రి మంచు మోహన్ బాబు - సోదరుడు విష్ణు .. మనోజ్ ని వారించారు. దీంతో ఆ ఆలోచన విరమించుకుని నటనలో కొనసాగుతానని - సినిమాలపై తన ప్రేమ తగ్గదని అన్నారు.
తాజాగా మనోజ్ లైఫ్ లో మరో కీలక పరిణామం గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మనోజ్ హైదరాబాద్ నుంచి తిరుపతికి తాత్కాలికంగా మకాం మార్చానని ప్రకటించారు. అయితే దీనివెనక అసలు కారణం ఏమై ఉంటుంది? అంటూ అభిమానుల్లో క్రేజీగా డిబేట్ సాగుతోంది. `తాత్కాలికం` అని మెన్షన్ చేయడం వెనక ఇంకే కారణం ఉండి ఉంటుంది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. మనోజ్ సినీ కెరీర్ ఎలానూ చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఆ క్రమంలోనే మనోజ్ రాజకీయారంగేట్రం చేయడం కోసమే ఈ ప్రయత్నం అని అంటున్నారు. తండ్రి పొలిటికల్ వారసత్వాన్ని - లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా మనోజ్ - విష్ణు తిరుపతిలో సామాజిక సేవల్లో బిజీగా ఉన్నారు. తిరుపతి శ్రీనికేతన్ పరిసరాల్లో నీళ్ల ట్యాంకుల సరఫరా వగైరా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే పేదలు - ఆడపిల్లల చదువులకు అవసరం మేర ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ప్రజల తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. తిరుపతి - చంద్రగిరి - శ్రీకాళహస్తి వరకూ మంచు కుటుంబం అంతో ఇంతో ప్రాభవం కలిగి ఉంది. ఆ పరిసరాల నుంచి అధిక మొత్తంలో శ్రీవిద్యానికేతన్ లో చేరి విద్యను అభ్యసిస్తుండడంతో ప్రజల కుటుంబాలతో నేరుగా సత్సంబంధాలు నెలకొన్నాయి.
మరోవైపు మంచు విష్ణు ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా టెక్నోస్కూళ్ల విస్తరణలోనూ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే అన్నదమ్ములు యూటర్న్ పై రకరకాలుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. విద్యా రంగంలో కృషి - అనంతరం రాజకీయ రంగంలోనూ తమ ప్రాభవం చూపించాలని అన్నదమ్ములు భావిస్తున్నారా? అంటూ ఆసక్తికర చర్చ వైరల్ గా మారింది. సినిమా రంగం- రాజకీయ రంగం ఈ రెండిటికీ ప్రజల్లో ఉండే ఇమేజ్ వేరు. సినిమా రంగం తర్వాత స్టార్ల చూపు రాజకీయ రంగం వైపే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచు మనోజ్ చేస్తున్నది అదేనన్న చర్చా సాగుతోంది.