Begin typing your search above and press return to search.

విభేదాలు.. తమ్ముడు వేరుగా ఉండటం నిజమే!

By:  Tupaki Desk   |   25 Aug 2021 4:38 AM GMT
విభేదాలు.. తమ్ముడు వేరుగా ఉండటం నిజమే!
X
మంచు బ్రదర్స్‌ విష్ణు మరియు మనోజ్ లు గత కొన్నాళ్లుగా విభేదాలతో ఉన్నారు అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వీరిద్దరి విషయమై చాలా పెద్ద చర్చ జరుగుతోంది. అసలు మంచు ఫ్యామిలీ లో ఏం జరుగుతోంది.. నిజంగానే మంచు విష్ణు కు మనోజ్‌ కు మద్య దూరం పెరిగిందా అనేది మంచు అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. మంచు మనోజ్ గత కొన్నాళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు అనేది చాలా మంది బలంగా చెబుతున్న మాట. ఆ మాట వాస్తవమే అంటూ అలీతో సరదాగా టాక్ షో లో మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. కాని మా మద్య విభేదాలు లేవు అనేది స్పస్టంగా చెప్పేశాడు.

మంచు విష్ణు ఈ వారం అలీతో సరదాగా టాక్ షో గెస్ట్. ఆయన తో పలు విషయాల గురించి అలీ మాట్లాడాడు. కుటుంబ తగాదాలు.. ఆస్తి విషయాల గురించి ప్రశ్నించగా మంచు విష్ణు సీరియస్‌ అయ్యాడు అంటూ ప్రోమోలో చూపించారు. అసలు ఏం జరిగింది.. మంచు విష్ణు తమ్ముడు మనోజ్ గురించి ఏం చెప్పబోతున్నాడా అంటూ అంతా కూడా ఎపిసోడ్‌ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు వచ్చిన ఎపిసోడ్‌ లో మంచు విష్ణుతో అన్ని విషయాలను అలీ చెప్పించాడు. మంచు విష్ణు మాట్లాడుతూ మీడియాలో తమ కుటుంబంలో ఉన్న విభేదాల గురించి స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అక్క లక్ష్మి వేరుగా ఉంటుంది.. అలాగే తమ్ముడు మనోజ్ కూడా వేరుగా ఉంటున్నాడు. నేను మాత్రం నాన్న వాళ్లతో కలిసి ఉంటున్నాను. వేరుగా ఉన్నంత మాత్రాన విభేదాలు ఎలా అవుతాయి. అయినా మా కుటుంబ విషయాల గురించి అస్సలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటూ స్పష్టంగా చెప్పాడు. మా ఫ్యామిలీలో బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఎలాంటి విభేదాలు లేవు అంటూ స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. మీడియా కథనాల గురించి మా ఫ్యామిలీ ఎక్కువగా పట్టించుకోమని.. తామంతా కూడా చాలా కలివిడిగానే ఉన్నట్లుగా మంచు విష్ణు చెప్పే ప్రయత్నం చేశాడు. మంచు విష్ణు వ్యాఖ్యలతో ఆ ఫ్యామిలీలో ఎలాంటి పెద్ద గొడవలు లేవని మాత్రం కన్ఫర్మ్‌ అయ్యింది.