Begin typing your search above and press return to search.
స్టూడియో కడతావ్ సరే.. 'మా' బిల్డింగ్ సంగతేంటి విష్ణూ..?
By: Tupaki Desk | 16 Feb 2022 8:30 AM GMTటాలీవుడ్ హీరో మంచు విష్ణు గత కొన్ని నెలలుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల విడుదలలు లేకపోయినా బాగా ఫోకస్ అవడానికి కారణం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలనే సంగతి అందరికీ తెలిసిందే. 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచో ఏదొక విషయంలో విష్ణు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.
మంచు విష్ణు నిన్న మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అవడం చర్చనీయంగా మారింది. సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీఎంతో 'మా' ప్రెసిడెంట్ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాకపోతే విష్ణు మాత్రం అది తమ వ్యక్తిగత మీటింగ్ అని.. జగనన్నతో లంచ్ చేయడానికే వచ్చానని స్పష్టం చేసారు.
జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు.. సినిమా స్టూడియో నిర్మాణం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ''100 శాతం తిరుపతిలో నేను స్టూడియో కడతా. ప్రభుత్వ సహకారం కోసం మళ్లీ వస్తాను. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి 30 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు అది మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. ఆసియాలోనే బెస్ట్ ఫిలిం కోర్సులు అందించబోతున్నాం. దానికి సంబంధించి మరొక ప్రెస్ మీట్లో వివరిస్తాను'' అని విష్ణు అన్నారు.
తిరుపతిలో స్టూడియో కట్టడం వల్ల ఏపీలో కూడా సినిమా షూటింగులు జరుగుతాయి. అక్కడ కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్ సైతం స్థలాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు కాబట్టి.. విష్ణు స్టూడియో నిర్మాణం చేపట్టడానికి అన్నీ సమకూరుతాయి. కానీ అప్పుడెప్పుడో ప్రకటించిన 'మా' బిల్డింగ్ ఎప్పుడు కడతారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో హామీలతో 'మా' అధ్యక్ష బరిలో దిగిన విష్ణు.. ప్రత్యర్థి ప్యానల్ తో డీ అంటే డీ అని భారీ మెజారిటీతో గెలుపొందారు. అందులో ప్రధానమైన హామీ 'సొంత ఖర్చుతో అసోసియేషన్ కు భవనం నిర్మించడం'. అయితే 'మా' ప్రెసిడెంట్ గా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని వంద రోజులు దాటినా ఇంతవరకు బిల్డింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలకు ముందు మూడు స్థలాలు చూసి పెట్టానని అన్నారు కానీ.. అవి ఎక్కడనేది వెల్లడించలేదు.
'మా' భవనంపై ఎప్పుడు కార్యాచరణ రూపొందిస్తారని సభ్యులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు బిల్డింగ్ కోసం విష్ణు ముందడుగు వేయకపోవడంపై సోషల్ మీడియాలో విష్ణుపై కామెంట్స్ వస్తున్నాయి. స్టూడియో నిర్మాణంతో పాటుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవన నిర్మాణం గురించి కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల సీఎంతో చిరంజీవి భేటీ గురించి స్పందించిన మంచు విష్ణు.. త్వరలోనే అసోసియేషన్ తరపున 'మా' భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తానని అన్నారు. మరి దీనిపై 'మా' అధ్యక్షుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో చూడాలి.