Begin typing your search above and press return to search.

రోటీనాచారి రుచిస్తాడంటారా?

By:  Tupaki Desk   |   21 Jan 2018 5:55 AM GMT
రోటీనాచారి రుచిస్తాడంటారా?
X
ఈ మధ్యకాలంలో.. స్వయంగా ఎంతో పాపులార్టీ ఉన్న పవన్ కళ్యాణ్‌ అయినాసరే.. అలాగే మాస్ లో దేవుడిగా కొలవబడే బాలయ్య అయినాసరే.. కంటెంట్ లేని సినిమాలతో వస్తే.. జనాలు తూచ్ అంటున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలే అందుకు పెద్ద ఎగ్జాంపుల్. కనీసం పైరసీలో కూడా ఆచరణకు నోచుకోవట్లేదు అంటూ ఆడియన్స్ జోకులు పేలుస్తున్నారంటే.. ఆ సినిమాల్లో కంటెంట్ కు వారిచ్చిన రెస్పెక్ట్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.

అందుకే ఇప్పుడు త్వరలో రాబోయే చాలామంది హీరోలు.. డిఫరెంట్ కాన్సెప్టులతో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని మంచు విష్ణు మాత్రం.. మరోసారి మాస్ సినిమాతో వస్తున్నాడు. అదే 'ఆచారి అమెరికా యాత్ర'. ఈ సినిమాలో ఇండియా నుండి అమ్మాయి కోసం అమెరికా వెళ్ళే బ్రాహ్మణుడి పాత్రలో మనోడు కనిపించాడు. కామెడీ అంతా బాగానే ఉన్నా కూడా.. స్టోరీ మాత్రం ఎక్కడో తేడా కొట్టేస్తోంది. ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్టులు అనేకం చూశాం. శ్రీను వైట్ల ఇటువంటి స్టోరీలనే మార్చి మార్చి తీశాడు. అందుకే ఈ మధ్యన ఫెయిల్యూర్లను ఎదుర్కొంటున్నాడు.

ఒకరి ఇంటికి వెళ్ళి.. అక్కడ అమ్మాయిని లేపుకురావడం అనేది దాదాపు అన్ని వైట్ల అండ్ కోన సినిమాల్లో సెంటర్ పాయింట్. రెడీ.. నమో వెంకటేశ.. మిష్టర్.. సినిమాలే అందుకు ఉదాహరణ. అలాగే గుడుంబా శంకర్ నుండి బిందాస్ వరకు.. సత్యం నుండి నేను శైలజ వరకు.. అన్నీ ఇలా అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి హీరోయిన్ ను తీసుకురావడం అనేదే కథ. అడియన్స్ కు ఇది పరమ బోర్ కొట్టేసింది. అందుకే ఈ రొటీనాచారి ఎలా రుచిస్తాడు అనేది ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహం.