Begin typing your search above and press return to search.
తమ్ముడు ఆంధ్రా లో.. అక్క తెలంగాణ లో..
By: Tupaki Desk | 4 Sep 2015 3:57 AM GMTఅక్కా తమ్ముడు అనుబంధాని కి ఓ ఎగ్జాంపుల్ చూపించండి అంటే ఎవరైనా ఏం చేస్తారు? చటుక్కున మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు ని, మంచు లక్ష్మీ ప్రసన్న ని చూపించాల్సిందే. అక్కంటే తమ్ముడి కి వల్లమాలిన ప్రేమ, తమ్ముడంటే అక్కకు వల్లమాలిన అభిమానం. అక్క బిడ్డ కోసం తమ్ముడు ఏమైనా చేస్తాడు. రోజూ బోలెడన్ని గిఫ్టులు కొని తెస్తాడు. సోదరుని బిడ్డల్ని సొంత కనుపాపల్లా చూసుకుంటుంది లక్ష్మీ మంచు. మంచు వారింట అనుబంధాలు అందరికీ ఆదర్శం. అయితే ఈ అక్కా తమ్ముళ్ల ను అక్కడి తో ఆగిపోలేదు.
ఇప్పుడు ఈ ఇద్దరూ సామాజిక సేవల్లో నూ నలుగురికి ఆదర్శం అవుతున్నారు. తమ్ముడు విష్ణు ఆంధ్రా జిల్లా చిత్తూరు పరిసరాల్లో ఏకంగా పది గ్రామాల్ని దత్తత తీసుకుని శ్రీమంతుడు అనిపించుకున్నాడు. నలుగురూ అతడిని ఆదర్శ హీరో అని పిలుస్తున్నారిప్పుడు. స్కూల్ డ్రాపౌట్స్ ని స్కూల్లో చేర్పించి, ఆడపిల్లల చదువుల పై శ్రద్ధ పెట్టి, మంచి నీటిని సరఫరా చేసే బాధ్యత విష్ణు తీసుకున్నాడు. తమ్ముడి కంటే నేనేమైనా తక్కువా అంటూ లక్ష్మీ మంచు ఏకంగా ఓ రాష్ర్టానికే అంబాసిడర్ అయ్యారు. తెలంగాణ స్వచ్‌భారత్ కి అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఈ నెల 10న లక్ష్మీ మంచు ప్రెసిడెంట్ సమక్షంలో రాష్ర్టపతి భవన్ సాక్షి గా ఈ గౌరవాన్ని అందుకోబోతున్నారు. స్వఛ్ భారత్ అంబాసిడర్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోబోతున్నారు.
లక్ష్మీ నేచురల్ యాక్టివిస్ట్. మంచి పనులుకు నేను సైతం అంటూ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు స్వఛ్ హైదరాబాద్ ని చేయడానికి రెడీ అవుతున్నందుకు సంతోషం. అక్కా తమ్ముడు ఇద్దరూ రెండు రాష్ర్టాల్లో మంచి పనులు చేయడం ఆహ్వానించదగ్గదే.