Begin typing your search above and press return to search.
మంచు హీరోల 'భక్త కన్నప్ప' ఏమైనట్టు?
By: Tupaki Desk | 11 Sep 2022 6:36 AM GMTరెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన `భక్త కన్నప్ప` ఆయన కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ హిట్. తన ఇమేజ్ ని స్టార్ పవర్ ని అమాంతం పెంచిన సినిమా ఇది. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో శోభన్ బాబు తర్వాత హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడంలో కృష్ణంరాజుకు సహకరించిన ప్రత్యేక చిత్రమిది. దివంగత దాసరి ప్రతిసారీ కృష్ణంరాజును తలవగాస్తే ఈ సినిమాని గుర్తు చేసేవారు. ఆ తర్వాతా భక్త కన్నప్ప రీమేక్ గురించి చాలా సందర్భాల్లో చర్చ సాగింది. ఇప్పుడు రెబల్ స్టార్ అంతర్థానం వేళ మరోసారి అభిమానుల్లో పరిశ్రమ వర్గాల్లో నూ దీని గురించి చర్చ సాగుతోంది.
క్లాసిక్ హిట్ మూవీ `భక్త కన్నప్ప` ను భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవల్లో రీమేక్ చేస్తామని అప్పట్లో మంచు కాంపౌండ్ వర్గాలు ధృవీకరించడం హాట్ టాపిక్ అయ్యింది. 450పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన మోహన్ బాబు కాంపౌండ్ నుంచి ఈ ప్రకటన రావడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. కృష్ణం రాజుతో ఆ కుటుంబ సాన్నిహిత్యం అంత గొప్పది. ఎంబీ నట వారసులుగా వచ్చిన మంచు విష్ణు- మంచు మనోజ్ సహకారంతో భక్త కన్నప్ప రీమేక్ ముందుకు వెళుతుందని ప్రచారమైంది. కానీ అది ఇప్పటివరకూ జరగలేదు.
అమెరికాలో వియామార్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే కంపెనీని ప్రారంభించి అక్కడి రచయితలతో తెలుగు రచయితలను సమన్వయం చేసుకుని మంచి కథల్ని వండించే ప్రయత్నంలో మంచు కుటుంబం ఉందని కూడా కథనాలొచ్చాయి. భక్త కన్నప్ప పనుల్ని వారు చూసుకుంటారని అన్నారు.
ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనల్లో పరిణితి వచ్చిందని.. దీనికి అనుగుణంగా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని విష్ణు అప్పట్లోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది ఎంత వరకు వర్కవుటుతుందో తెలియదుగానీ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు మంచు హీరో. ఈ చిత్రాన్ని ఆంగ్లంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తారని అన్నారు. తన కలల ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ప్రస్థావనను పదే పదే తెచ్చారు.
భక్త కన్నప్ప కోసం దాదాపు రూ. 95 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయాలని యోచిస్తున్నామని విష్ణు తెలిపారు. అయితే ఈ మూవీ దర్శకత్వం కోసం టాలీవుడ్ లో ముగ్గురు దర్శకులను సంప్రదించగా బడ్జెట్లో ఒక వంతు రెమ్యునరేషన్ అడిగారని.. అందుకే హాలీవుడ్ దర్శకునితో ఈ చిత్రం చేస్తామని మంచు హీరో సెలవిచ్చారు. విష్ణు ప్రయత్నాలు ఆసక్తిని కలిగించాయి. కానీ ఆ ప్రయత్నం ఏమైందో విష్ణు ఇప్పటికీ వెల్లడించలేదు. భక్త కన్నప్ప రీమేక్ స్టంట్ కేవలం మా ఎన్నికల కోసమేనా? అంటూ మరోసారి సినీవర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంచు హీరోల సంతాప ట్వీట్లు
I am at loss of words! #KrishnamRaju my brother. (పదాలు లేవు.. మాట రావడం లేదు.. #కృష్ణంరాజు నా సోదరుడు) అంటూ మోహన్ బాబు ఎమోషనల్ గా ట్వీట్ చేసారు.
మన కుటుంబం పెద్దను కోల్పోయింది.. హృదయం ముక్కలైంది! అతడు లెజెండ్! అంటూ మంచు విష్ణు `మా` అధ్యక్షుని హోదాలో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఇలా ఉంది.. Heartbroken