Begin typing your search above and press return to search.
ఆ క్రేజీ సీక్వెల్ ని డైరెక్టర్ లైట్ తీసుకున్నాడా..?
By: Tupaki Desk | 20 Oct 2022 2:30 AM GMTటాలీవుడ్ హీరో మంచు విష్ణు మరియు డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషనల్ లో రూపొందిన సూపర్ హిట్ సినిమా 'ఢీ'. 2007లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్లుగా దర్శక హీరోలు రెండేళ్ల క్రితమే ధృవీకరించారు. ''డి అండ్ డి'' (డబుల్ డోస్) అనే టైటిల్ తో అధికారికంగా ప్రకటించారు. ఇందులో హీరోయిన్లుగా అను ఇమ్మాన్యుయేల్ - ప్రగ్యా జైశ్వాల్ లను తీసుకున్నారు.
''D & D'' చిత్రాన్ని అవరమ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నట్లు పోస్టర్ కూడా వదిలారు. అయితే అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమాకు సంబంధించి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు విష్ణు 'జిన్నా' సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి.. దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాడు. కానీ శ్రీను వైట్లతో తలపెట్టిన 'ఢీ' సీక్వెల్ పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు.
దీంతో ''డి అండ్ డి'' మూవీ మధ్యలోనే ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల 'జిన్నా' ప్రమోషన్స్ సమయంలో త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ' సీక్వెల్ ను ప్రారంభిస్తానని మంచు విష్ణు పేర్కొన్నారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.
నిజానికి శ్రీను వైట్ల చాలా సమయాన్ని వెచ్చించి 'ఢీ 2' స్క్రిప్ట్ ని రెడీ చేసారు. ఈ చిత్రాన్ని లాంచ్ చేసారు కానీ.. షూటింగ్ ప్రారంభం కాకముందే మంచు విష్ణు దీన్ని హోల్డ్ లో పెట్టాడు. కోన వెంకట్ తీసుకొచ్చిన ''జిన్నా'' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. దీంతో నిరాశ చెందిన శ్రీను వైట్ల.. మరో కొత్త ప్రాజెక్ట్ లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడట. దీని కోసం తన సన్నిహితుడు గోపీ మోహన్ సహాయం తీసుకున్నాడు.
ఈ క్రమంలో గోపీచంద్ కు స్క్రిప్ట్ నేరేట్ చేసి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు శ్రీను వైట్ల. ఇటీవల గోపీచంద్ బర్త్ డే సందర్భంగా దర్శకుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఓ ఎన్నారై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. శ్రీను - గోపీ ల సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
మంచు విష్ణు 'జిన్నా' సినిమా పూర్తి చేసి ఉన్నారు. అయినప్పటికీ అతన్ని కాదని గోపీచంద్ తో వెళ్తున్నారంటే.. 'ఢీ' సీక్వెల్ పై శ్రీను వైట్ల ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది. కానీ విష్ణు మాత్రం త్వరలో తమ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వాస్తవానికి ప్రస్తుతం శ్రీను వైట్ల - విష్ణు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇద్దరికీ సరైన సక్సెస్ అవసరం అవసరం అనుకుంటున్న సమయంలో తమ కాంబోలో వచ్చిన 'డీ' సీక్వెల్ ను ప్రకటించారు. ఇది ఇద్దరికీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని అందరూ భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటన వరకే పరిమితం అయింది. మరి భవిష్యత్ లో మళ్ళీ 'డి అండ్ డి' గురించి ఆలోచిస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.