Begin typing your search above and press return to search.

మంచు జంట పదేళ్ల అనుబంధం

By:  Tupaki Desk   |   3 April 2016 1:30 PM GMT
మంచు జంట పదేళ్ల అనుబంధం
X
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో మంచి విష్ణు- విరానికాల జంట మొదట్లోనే ఉంటుంది. తమ పెళ్లి గురించి, పరిచయం గురించి ఈ జంట చెప్పే మాటలు వారి మధ్య అనుబంధాన్ని చెప్పకనే చెబుతాయి. 'ఒకప్పుడు నావి అనేవి ఏవైనా.. పెళ్లి జరిగాక అన్నీ తనవైపోయాయి. మేం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులం కాదు. మేమిద్దరం కలిపి ఒకటి'- మ్యారేజ్ తర్వాత భర్త మంచు విష్ణు చెప్పిన మాటలను ఇప్పటికీ గుర్తుంచుకుంది విరానికా.

విష్ణు-విరానికాలకు 2009 మార్చ్ లో పెళ్లి జరిగింది. అయితే అంతకు మూడేళ్లకు ముందే వీరి పరిచయం జరిగిందట. 'మేము మొదటిసారిగా కలిసి పదేళ్లు పూర్తయింది. మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో జరుగుతున్న ఓ పార్టీ కోసం.. మోహన్ బాబు గారి కోసం ఎదురుచూస్తున్నా. అప్పుడు కారు దిగి వస్తున్నపుడు మొదటిసారిగా విష్ణును చూశాను. మిగతాదంతా చరిత్రే' అంటోంది విరానికా.

'మా మధ్య ప్రేమ పుట్టడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆ ఫీలింగ్ కలగ్గానే తనతో మాట్లాడాను. మొదటిసారే చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. మా మధ్య సంభాషణ వైవిధ్యమే కాదు.. ఇంటలెక్చువల్ గా సాగింది.' ఇప్పుడీ జంట తమ పరిచయమై పదేళ్లు గడిచిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.