Begin typing your search above and press return to search.

మంచు విష్ణుకు కొడుకు పుట్టాడు

By:  Tupaki Desk   |   1 Jan 2018 3:55 PM GMT
మంచు విష్ణుకు కొడుకు పుట్టాడు
X
పర్ఫెక్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే ఇదేనేమో తెలియదు కాని.. ఇప్పుడు మంచు వారింట మాత్రం ఆనందాలు విరబూసాయి. ఒక ప్రక్కన జనవరి 1 వచ్చిందంటూ ఆనందపడుతున్న వేళ.. ఆ ఇంట ఇప్పుడు మరో కొత్త మెంబర్ అడుగుపెట్టాడు. దానితో ఇప్పుడు మంచువారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయ్.

మంచు విష్ణు భార్య విరానిక కు ఈరోజు పండంటి బాబు పుట్టాడని తెలుస్తోంది. సిటీలోని ఒక స్టార్ హాస్పిటల్ లో వీరికి ఈ తొలి మగ సంతానం జన్మించాడట. చాన్నాళ్ళు ప్రేమించుకున్నాక 2008లో పెళ్ళిచేసుకున్న మంచు విష్ణు దంపతులు.. 2011లో అరియానా వివియానా అనే ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త పిల్లాడు అడుగుపెట్టడం మంచువారింట మరిన్ని కొత్త పండగలను తెస్తోంది. ఎందుకంటే.. ఎప్పుడూ తమ ముగ్గురు ఆడ పిల్లలతో.. విష్ణు పిల్లలు మరియు లక్ష్మీ కూతురు నిర్వాణతో.. వారి ప్యాలెస్ కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మరో మనవడు వచ్చాడంటే మరి మోహన్ బాబు ఇంటి హ్యాపినెస్ రెట్టింపు అవుతుందిగా!!

ఈ శుభసందర్బాన కంగ్రాట్స్ టు మంచు ఫ్యామిలీ!!