Begin typing your search above and press return to search.
రివ్యూలపై మంచు హీరో రియాక్షన్
By: Tupaki Desk | 28 Sep 2017 7:15 AM GMTసినిమా రివ్యూలపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. గతంలో కూడా చాలా రకాల అభిప్రాయాలే వినిపించాయ్ కానీ.. రీసెంట్ గా ఎన్టీఆర్ లాంటి స్టార్ వీటిపై సీరియస్ కామెంట్స్ చేయడంతో.. ఇది వివాదంగా మారింది. యంగ్ టైగర్ తన పర్సనల్ ఒపీనియన్ చెప్పాడులే అనుకునేలోపు.. అందుకు వ్యతిరేకంగా మహేష్ బాబు మాట్లాడడంతో.. ఇది చర్చనీయాంశం అయిపోయింది.
ఇప్పుడు హీరో మంచు విష్ణు కూడా రివ్యూలపై రియాక్ట్ అయ్యాడు. ముందు ఇద్దరికీ విభిన్నంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. హాట్ టాపిక్స్ గా ఉన్న ఇష్యూలపై స్వయంగానే ప్రతిస్పందించే మంచు విష్ణు.. సోషల్ మీడియా ద్వారా ఈ టాపిక్ పై రియాక్ట్ అయ్యాడు. విష్ణు చెప్పిన మాటలను యాజ్ఇటీజ్ గా చెప్పాలంటే "శ్రద్ధగా ఓ సినిమాను చూసినపుడు.. సరైన రివ్యూ ఇచ్చే అవకాశం ఉంటుంది. సినిమా చూస్తున్నపుడే దాని గురించి అప్ డేట్స్ ఇవ్వడాన్ని గౌరవనీయులైన రివ్యూ రైటర్స్ మానేయాలి".. మంచు విష్ణు చెప్పిన మాట సింపుల్ గా అయితే ఇదే. సినిమాలకు సమీక్షలు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెరిగిపోయిన పోటీ కారణంగా.. రివ్యూల పరిస్థితి కొంత దారుణంగా ఉందని ఒప్పుకోవాలి.
కొన్ని ఫ్రంట్ లైన్ పోర్టల్స్ మినహాయిస్తే.. మిగిలిన వాటిలో ఫస్ట్ షో హైలైట్స్ అంటూ.. హీరో వచ్చాడు.. ఫైట్ చేశాడు.. హీరోయిన్ వచ్చింది పాటేసుకుంది టైపులో అప్ డేట్స్ ఇస్తూ.. సినిమాపై ఆసక్తిని సగం చంపేసే ప్రక్రియ పీక్స్ లోనే ఉంది. ఇది వాళ్ల సైట్ కి ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. సినిమాకు మాత్రం చెడు చేస్తోంది. ఆ సినిమాల అప్ డేట్స్ పైనే ఆధారపడిన పోర్టల్స్.. అదే సినిమా రంగానికి చెడు చేయడం కరెక్ట్ కాదు.. అంటూ ఇన్ డైరెక్టుగా తన ఉద్దేశ్యాన్ని సౌమ్యంగా చెప్పాడు మంచు విష్ణు. అందరినీ ఒకే గాటన కట్టకుండా.. చెప్పాల్సిన విషయాన్ని సుతిమెత్తగా అంటించిన మంచు విష్ణును పొగడాల్సిందే కదూ.