Begin typing your search above and press return to search.

టీ సర్కార్‌ నిర్ణయంపై మంచు విష్ణు హర్షం

By:  Tupaki Desk   |   13 April 2021 5:30 AM GMT
టీ సర్కార్‌ నిర్ణయంపై మంచు విష్ణు హర్షం
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్యా రంగం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈ సమయంలో ప్రైవేట్‌ టీచర్లు పడుతున్న బాధలు వారి కష్టాలు ప్రతి రోజు మీడియాలో వస్తూనే ఉన్నాయి. ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు ఈ సమయంలో టీచర్లకు జీతాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేయడంతో పాటు వారికి సంబంధించిన చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేక ఏకంగా స్కూల్స్‌ ను మూసి వేస్తున్నారు. దాంతో స్కూల్ టీచర్స్‌ రోజు వారి కూలీ పనులకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కొందరికి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో చాలా మంది టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కష్టాలను తీర్చేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.2 వేల రూపాయలను నెల నెల అందించడంతో పాటు 25 కేజీల బియ్యం ను కూడా అందిస్తామంటూ ప్రకటించింది. టీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మంచు మోహన్‌ బాబు తనయుడు మంచు విష్ణు ఈ విషయమై స్పందించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతి ఒక్క టీచర్‌ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రూ.2000 సాయం మరియు బియ్యం పంపిణీ చేయడం అనేది నిజంగా గొప్ప విషయంగా మంచు విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశాడు. మంచు వారి ఫ్యామిలీ విద్యా సంస్థలను నిర్వహిస్తూ ఉంటారు. విద్యా రంగం పట్ల వారికి మొదటి నుండి అనుభవం ఉన్న విషయం అందరికి తెల్సిందే.