Begin typing your search above and press return to search.
మెగా ఓటు నాకే.. మంచు విష్ణు కాన్ఫిడెన్స్
By: Tupaki Desk | 28 Sep 2021 5:30 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ రంగుని పులుముకుంటూ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మునుపెన్నడూ లేనంతగా `మా` ఎన్నికలపై వాడి వేడి చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో ఆ వేడి మరింతగా పెరిగింది. ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు.. సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి పోటీపడుతుండగా పోటీ మాత్రం ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మధ్యే జరగబోతోంది.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబర్స్ తో సహా నామినేషన్ దాఖలు చేయడంతో మంచు విష్ణు కూడా నామినేషన్ వేసేందుకు తన ప్యానెల్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. `మా` ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొన్నా చిరు ఎవరికి మద్దతుగా నిలిస్తే వారినే విజయం వరిస్తూ వచ్చింది. అదే సెంటిమెంట్ ఈ దఫా కూడా రీపీట్ అవుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది.
ఈ ఎన్నికల్లో మెగాస్టార్ ఓటు తనకే వేస్తారని.. తనకే మద్దతుగా నిలుస్తారని మంచు విష్ణు చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. త్వరలో నామినేషన్ వేసిన తరువాత చిరుని కలుస్తామని..ఖచ్చితంగా ఆయన తమకే మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా మా ఎన్నికల మ్యానిఫెస్టోని వివరిస్తే ఆయన ఖచ్చితంగా మాకే మద్దతుగా నిలుస్తారన్నారు.
ఇక ప్రకాష్‌రాజ్‌తో పోలిస్తే తానే `మా` అభివృద్ధి కోసం పాటుపడతానని.. తన వద్దే `మా` కోసం పక్కా ప్రణాళిక వుందని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. `మా` అధ్యక్షుడిగా పదవి చేపడితే అప్పు చేసైనా `మా` కోసం సొంత భవనాన్ని కట్టిస్తానని తెలిపారు. `మా` సభ్యుల పిల్లల స్టడీ విషయంలోనూ తన వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక వుందని దాని ఆధారంగానే ముందుకు వెళ్లాలనుకుంటున్నాని ధీమా వ్యక్తం చేశారు మంచు విష్ణు. ఇదిలా వుంటే ఇప్పటికే ప్రకాష్‌రాజ్ వెనక చిరు వున్నాడంటూ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ మంచు విష్ణు మాత్రం చిరు మద్దతు తనకే అంటూ ధీమాని వ్యక్తం చేయడంతో బహిరంగంగా చిరు ఎవరికి తన మద్దతు అన్నది ప్రకటిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రకాష్ రాజ్ అన్నిటా ముందే..!
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వేడి ఇకపై ఈ 10రోజులు మరింత రంజుగా మారనుంది. విందు రాజకీయాలతో ఇప్పటికే అట్టుడుకుతున్న ఇండస్ట్రీ మునుముందు మరింతగా అగ్గి రాజేయబోతోంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తుండగా.. తెరవెనక దిగ్గజాలు నడిపిస్తున్న పోరుగా దీనిని అంతా చూస్తున్నారు. అధ్యక్షపదవి రేసులో ఉన్న ప్రకాష్ రాజ్ చాలా ముందే తన ప్యానెల్ సభ్యులను మీడియాకి పరిచయం చేసి అజెండాను ప్రకటించగా.. ఇటీవలే మంచు విష్ణు తన ప్యానెల్ ని ఎజెండాను ప్రకటించారు. అక్టోబర్ 10 న ఎన్నికల్లో తాడో పేడో తేలిపోనుంది.
ఆ రోజు మధ్యాహ్నానికి రిజల్ట్ తేలిపోనుంది. ఈసారి 2021-23 సీజన్ కి ఆర్టస్టుల సంఘం (మా) అధ్యక్షుడు ఎవరు? అన్నది ఖరారు కానుంది. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో ఫిలింఛాంబర్ లో సోమవారం నాడు నామినేషన్ వేశారు. తదుపరి విష్ణు ప్యానెల్ వంతు.
పోరులో ఇద్దరూ ఎవరికి వారే స్పెషల్. ఎవరి బలగాలు వారికి ఉన్నాయి. మెగా బ్రదర్స్ చిరంజీవి.. నాగబాబు అండ ప్రకాష్ రాజ్ కి పుష్కలంగా ఉంది. పవన్ కల్యాణ్ సహా పలువురు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణుకు సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ సహా వీకే నరేష్ వర్గాల అండదండలు ఉన్నాయి. సినీపెద్ద కృష్ణంరాజు సహకారం ఎవరికి అన్నది చూడాలి. ఆ ఇద్దరిలో అంతిమ విజయం ఎవరిదో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. మరో 13 రోజుల్లో రిజల్ట్ తేలనుంది. మా ఎన్నికల అజెండా ఏదైనా కానీ.. కేవలం 950 ఓట్లు ఉన్న ఈ అసోసియేషన్ హడావుడి పెద్ద స్థాయిలో చర్చకు వస్తోంది. ఒక సెక్షన్ మీడియా మా ఎన్నికల పేరుతో టీర్పీలు గుంజుతోందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇరు వర్గాలు మా అసోసియేషన్ లో మార్పులు తెస్తానని.. ప్రతి సభ్యుడికి మెడి క్లెయిమ్ ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. మా సంఘం గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేయడం బాలేదని విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చాలా వరకూ ఏకగ్రీవం కోసమే ప్రయత్నించానని కూడా విష్ణు అన్నారు. ఎన్నికల తీరుపై ఎవరూ హ్యాపీగా లేరని ఎన్నికల గురించి మీడియా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమని కూడా అన్నారు. తన ప్యానెల్ లో ఆడాళ్లకు పెద్ద పీట వేస్తానని మంచు విష్ణు అన్నారు. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
ఆర్టిస్టుల సొంత భవంతిని తాను సొంత డబ్బులతో నిర్మిస్తానని ప్రకటించిన మంచు విష్ణు.. అందులో మల్టీప్లెక్స్.. కళ్యాణ మండపం కట్టనని తేల్చి చెప్పారు. పదవిలో ఉన్నా లేకపోయినా సేవలు చేస్తాను. సమస్యలు ఉంటే కూచుని మాట్లాడుకుందామని విష్ణు అన్నారు. ఇక రాజకీయ పార్టీల జోక్యం తగదని విష్ణు సెటైర్లు వేసారు. ఆర్టిస్టుల ఎన్నికలను రాజకీయ పార్టీలతో ముడి వేయకండి అని మంచు విష్ణు అన్నారు. 26 మందితో ప్యానెల్ ని విష్ణు ప్రకటించారు.