Begin typing your search above and press return to search.
అందమైన వాంపైర్లు
By: Tupaki Desk | 1 Nov 2017 4:38 AM GMTడ్రాకులా.. వాంపైర్ ఈ మాటలు హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు పరిచయం ఉండే పదాలే. హాలీవుడ్ లో హర్రర్ సినిమాల్లో భయపెట్టే రూపాల్లో డ్రాకులా.. వాంపైర్లు కనిపిస్తారు. ఆ పాత్రలతో చాలానే సినిమాలు వచ్చాయి. కొందరు డ్రాకులా అబిమానులు ఆ గెటప్ లు వేసుకుని వీధుల్లో తిరుగుతూ సందడి కూడా చేస్తుంటారు. తాజాగా హీరో మంచు విష్ణు కూతుళ్లు కూడా ఈ గెటప్పుల్లో కనిపించారు.
మంచు విష్ణు - వెరానికా దంపతులకు ఇద్దరు కవల ఆడపిల్లలున్నారు. తాజాగా వెరానికా వీళ్లిద్దరికీ వాంపైర్ డ్రస్సులు తొడిగి.. కొంచెం మేకప్ కూడా అదీ వేసి డిఫరెంట్ గా సిద్ధం చేసింది. వీళ్లిద్దరి ఫొటోను ట్విట్టర్ లో అభిమానులకు షేర్ చేసింది. దీనికి మై బ్యూటిఫుల్ వ్యాంపైర్స్ అనే కామెంట్ కూడా పెట్టింది. అమాయమైన చూపులతో.. ముద్దులొలికించే నవ్వుల్తో ఉన్న ఈ చిన్నారులను వ్యాంపైర్స్ అంటే ఒప్పుకోవడానికి మనసు రాదు కదా.. అందుకే అందరూ ఈ బ్యూటిఫుల్ వ్యాంపైర్స్ చూడటానికి ఏంజెల్స్ లాగానే ఉన్నారంటూ కితాబు ఇచ్చేస్తున్నారు.
ప్రస్తుతం మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తున్నాడు. బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇంతకుముందు దేనికైనా రెడీ - ఈడోరకం.. ఆడోరకం సినిమాలతో తనకు మంచి హిట్లిచ్చిన జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ కామెడీ ఎంటర్ టెయినర్ చేస్తున్నాడు. కంచె ఫేం ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.