Begin typing your search above and press return to search.
అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పి.. మంచు విష్ణు కొందరినే ఆహ్వానించారా..?
By: Tupaki Desk | 16 Oct 2021 7:00 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన 'మా' కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. 'మా' అధ్యకుడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విష్ణు ప్రమాణ స్వీకారానికి డిఆర్సీ సభ్యులు మంచు మోహన్ బాబు - సీనియర్ నటులు నరేష్ - శివ కృష్ణ - నిర్మాతలు సి. కళ్యాణ్ - ప్రసన్న కుమార్ అతిధులుగా వచ్చారు. అయితే 'మా' అధ్యకుడి ప్రమాణ స్వీకారంలో మెగా ఫ్యామిలీ సభ్యులు కానీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థులు కానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో అసలు వారికి ఆహ్వానం అందిందా లేదా అనే చర్చ మొదలైంది. 2015 నుంచి 'మా' కొత్త కమిటీ ఏర్పాటైనప్పుడు ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీలోని ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.
మంచు విష్ణు కూడా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఇండస్ట్రీ పెద్దలకు ఆహ్వానం పంపారు. కైకాల సత్యనారాయణ - కోట శ్రీనివాసరావు - బ్రహ్మానందం - పరుచూరి బ్రదర్స్ వంటి వారిని ఇన్వైట్ చేసినట్లు విష్ణు స్వయంగా తెలిపారు. నందమూరి బాలకృష్ణ ను విష్ణు తన తండ్రి మోహన్ బాబు తో సహా ఇంటికి వెళ్లి మరీ పిలిచారు. ఈ సందర్భంగా 'మా' అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతానని.. మెగాస్టార్ చిరంజీవి ని కూడా ఆహ్వానించనున్నట్లు విష్ణు చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి ని పిలవలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
'మా' ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లమోహన్ బాబు - విష్ణు.. చిరంజీవి ని ఆహ్వానిస్తారా లేదా అని అందరూ ఆలోచించారు. కొందరు విశ్లేషకులు ఊహించినట్టుగానే మెగాస్టార్ కు ఎటువంటి ఆహ్వానం అందలేదని టాక్ వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు కూడా ఫోన్ లో మెసేజ్ ద్వారా మాత్రమే ఆహ్వానం పంపినట్లు చెబుతున్నారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని వెళ్తానన్న మంచు విష్ణు.. ఆది లోనే ఇలా చేయడం ఏంటనే చర్చలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో 'మా' లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇకపోతే గత ఆరేళ్ళ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే 'మా' అధ్యక్షుడు బాధ్యతలు తీసుకువడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి దానికి భిన్నంగా మంచు విష్ణు సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులెవరూ హాజరు కాలేదు. ‘మా’ ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది.. విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి పనిచేయలేమని తమ పదవులకు రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచు విష్ణు అందరిని కలుపుకుని ఎలా వెళ్లారు అని అందరూ ఆలోచిస్తుండగా.. ఇప్పుడు తన ప్రమాణ స్వీకారానికి కొందరినే పిలిచాడనే వార్తలు చర్చనీయాంశంగా మారింది.