Begin typing your search above and press return to search.

మంచు విష్ణు తప్పటడుగు

By:  Tupaki Desk   |   23 Oct 2022 12:30 AM GMT
మంచు విష్ణు తప్పటడుగు
X
మంచు విష్ణు కెరీర్లో కీలకమైన సినిమా 'జిన్నా'. విష్ణు గత సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో కొంచెం గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా ఈ చిత్రం చేశాడు విష్ణు. తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్లో కోన వెంకట్ లాంటి సీనియర్ రైటర్ అండతో శ్రీను వైట్ల శిష్యుడైన సూర్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేశాడు విష్ణు. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ లాంటి హాట్ హీరోయిన్లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇంకా సినిమాలో చాలామంది కమెడియన్లు ఉన్నారు. 'జిన్నా' ట్రైలర్ చూస్తే మంచి ఎంటర్టైనర్ లాగే కనిపించింది.

ఈ సినిమాకు టాక్ కూడా డీసెంట్‌గానే ఉంది. కానీ ఆల్రెడీ 'కాంతార' చాలా బాగా ఆడుతుండగా.. దీపావళికి ఇంకో మూడు సినిమాలతో పోటీ పడడం 'జిన్నా'కు చేటు చేసింది. సినిమాకు తొలి రోజు ఆశించిన ఆక్యుపెన్సీ లేదు. టాక్ బాగున్నా కూడా సినిమాకు వసూళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య రావడం ఈ సినిమాకు చేటు చేసినట్లు కనిపిస్తోంది.

'జిన్నా' సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు పోటీ ఎక్కువుందని దీపావళికి వాయిదా వేశారు. నిజానికి దసరాకి పోటీ ఉన్నా సరే.. అది సెలవుల టైం కాబట్టి వసూళ్లు మెరుగ్గా ఉండేవి. అప్పుడు కుదరదంటే తర్వాతి వారం పెద్దగా పోటీ లేనపుడు సినిమాను రిలీజ్ చేయాల్సింది. అలా కాదంటే దీపావళి తర్వాతి వారం కూడా కూడా ఖాళీనే.

అప్పుడు విడుదల చేసుకున్నా బాగుండేది. అలా కాకుండా దీపావళి టైంలో మ్యాడ్ రష్ ఉన్న టైంలో సినిమాను విడుదల చేసి నష్టం చేసుకున్నాడు విష్ణు. పోటీ వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఆ చిత్రమే అని దీని ఆక్యుపెన్సీ, వసూళ్లు చూస్తే స్పష్టమవుతోంది. దీపావళికి రిలీజైన సినిమాల్లో చివరగా ఈ పండక్కి రిలీజ్ కన్ఫమ్ చేసుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం. గత సినిమాతో పోలిస్తే మెరుగైన చిత్రం తీసి కూడా పోటీ వల్ల ప్రేక్షకుల దృష్టిలో పడక సినిమా దెబ్బ తింటోంది. మరి శని, ఆదివారాల్లో ఏమైనా సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.