Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' టీజర్ పై కామెంట్స్.. ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన మంచు విష్ణు..!
By: Tupaki Desk | 15 Oct 2022 7:12 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా టీజర్ పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా గత రెండు రోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే టీజర్ పై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని విష్ణు తాజాగా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
''ఫేక్ న్యూస్! నేను ఊహించిన విధంగానే 'జిన్నా' విడుదలకు ముందు కొంతమంది ఐటెమ్ రాజాలు కావాలనే ఇలాంటి నెగెటివ్ వార్తలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అంతకు మించి నాకేమీ వద్దు" అంటూ విష్ణు శనివారం ఉదయం ట్వీట్ చేశారు.
రామాయణం ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే ''జిన్నా'' ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చినట్లు పేర్కొన్న బాలీవుడ్ మీడియా సంస్థ DNA.. 'ఆదిపురుష్' టీజర్ పై స్పందించినట్లు నివేధించింది.
రామాయణం మీద మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ సినిమా అవుతుందని అంతా అనుకున్నామని.. అయితే ఇది యానిమేషన్ చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదని.. అందుకే అందరూ నిరాశ చెందారని.. తాను కూడా మోసపోయానంటూ విష్ణు చెప్పినట్లుగా DND ఆర్టికల్ లో పేర్కొంది.
'ఆదిపురుష్' అనేది ఒక యానిమేషన్ చిత్రమని ముందుగానే చెప్పి ఆడియన్స్ ను ప్రిపేర్ చేసి ఉంటే.. ఈ టీజర్ పై ట్రోల్స్ వచ్చేవి కాదని మంచు విష్ణు అభిప్రాయ పడ్డారని తెలిపారు. దీంతో ఇదే విషయాన్ని తెలుగు ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా కూడా క్యారీ చేసింది. దీనిపైనే తాజాగా విష్ణు స్పందించారు.
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా టీజర్ పై తాను మాట్లాడినట్లు చక్కర్లు కొడుతోన్న కథనాలు ఫేక్ అని మంచు విష్ణు అంటున్నారు. ఇప్పుడు విష్ణు చెప్పింది నిజమైతే.. బాలీవుడ్ మీడియాలో కథనాలు ఎందుకు వచ్చాయని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే 'మా' అసోసియేషన్ మెంబర్ గా సభ్యత్వం ఇవ్వాలంటే హీరో లేదా హీరోయిన్ రెండు సినిమాల్లో నటించి ఉండాలి.. అవి ఓటీటీ లేదా థియేటర్ లో విడుదలై ఉండాలని అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అయ్యాయి. దీనిపైనా విష్ణు స్పందించారు.
''మరో నకిలీ వార్త! పెయిడ్ బ్యాచ్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది???? జీవితంలో కొంత ఆనందించండి. 21న #జిన్నా సినిమా చూడండి. సానుకూలంగా ఉండండి. దయచేసి వాస్తవాలను సరిగ్గా తెలుసుకోండి'' అంటూ మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన ని తన ఫ్యామిలీని కావాలనే కొందరు పెయిడ్ బ్యాచ్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఇటీవల విష్ణు ఆరోపించిన సంగతి తెలిసిందే.