Begin typing your search above and press return to search.
మంత్రికి మంచు ఫ్యామిలీ ఆతిధ్యం.. ట్వీట్ ఎడిట్ చేసి పోస్ట్ చేసిన విష్ణు..!
By: Tupaki Desk | 11 Feb 2022 1:30 PM GMTఏపీలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం నిన్న గురువారం సీఎం జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీకి మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు శుక్రవారం మంచు మోహన్ బాబు - 'మా' అధ్యక్షుడు విష్ణులతో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం వచ్చిన మంత్రి పేర్ని నానిని మంచు ఫ్యామిలీ ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ రేట్ల వివాదంతో సహా చిత్ర పరిశ్రమలోని పలు సమస్యలపై చర్చించారని సమాచారం. ఏపీలో సీఎంతో సినీ ప్రముఖుల భేటీ గురించి ఇరువురి మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ గురించి మొదట చేసిన ట్వీట్ ని ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం చర్చనీయంగా మారింది. ''ఈరోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాని గారు. టిక్కెట్ ధరపై మీరు చూపిన చొరవకు.. సినీ ఇండస్ట్రీ కోసం ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కొత్త ప్లాన్ లపై మాకు అప్ డేట్ చేసినందుకు ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు'' అని విష్ణు మొదటి ట్వీట్ లో పేర్కొన్నారు.
కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్ ని తొలగించిన మంచు విష్ణు.. మరో ట్వీట్ పోస్టు చేశారు. ''మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాని గారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. సినిమా టిక్కెట్ ధరపై మీరు చొరవ చూపినందుకు.. ఏపీలో ఇండస్ట్రీ కోసం చేపట్టిన కొత్త పథకాలను తెలియజేసినందుకు ధన్యవాదాలనే మ్యాటర్ ఇందులో తొలగించబడింది.
అప్పటికే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్న నెటిజన్స్.. ఈ ట్వీట్స్ పై మంచు విష్ణుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం నిన్నటి నుంచి మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసిన వారికి ఒక్క ట్వీట్ తో విష్ణు సమాధానం చెప్పాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే గురువారం కూడా మంచు విష్ణు ఓ రివర్స్ ట్వీట్ పెట్టి ఆ తర్వాత డిలీట్ చేసిన సంగతి తెలిసిందే.
''మీరు దీన్ని సులభంగా చదవగలిగితే.. బ్యాక్ వర్డ్స్ లో అద్భుతంగా చదవగలిగే శక్తి ఉన్నట్టే. పాయింట్ లెస్ టాలెంట్ మీలో ఉన్నట్టే..'' అని రివర్స్ లో చదివేలా ట్వీట్ చేసిన విష్ణు.. కొద్దిసేపటికే దాన్ని డిలేట్ చేసారు. ఈ క్రమంలో మరో ట్వీట్ ఎడిట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరో మంచు వారబ్బాయి ట్వీట్స్ డిలీట్ వెనుక ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలి.