Begin typing your search above and press return to search.

లక్కున్నాడులో.. ఆ F ఏంటో..

By:  Tupaki Desk   |   20 Jan 2017 1:50 PM GMT
లక్కున్నాడులో..  ఆ F ఏంటో..
X
లక్కున్నోడు అంటూ మంచు విష్ణు మూవీ రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీని.. ఫిబ్రవరి 3న రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ కి ఇంకా రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో.. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించేసింది లక్కున్నోడు టీం.

తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ఉన్న నాలుగు పాటలకు రెస్పాన్స్ బాగున్నా.. అన్నిటిలోకి సంథింగ్ స్పెషల్ గా ఓ పాటను చెప్పుకోవాల్సిందే. అద్నాన్ సామి పాడిన 'వాట్ ది ఎఫ్' సాంగ్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన ట్యూన్ క్యాచీగా ఉండడం.. దీనికి అద్నాన్ సామీ వాయిస్ తోడవడం.. వీటన్నిటికీ మించి మంచు విష్ణు వేసిన స్టెప్స్.. సాంగ్ ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి.

సోలో సాంగ్ గా వచ్చే ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందంటున్నాడు దర్శకుడు రాజ్ కిరణ్. ఎంవీవీ సత్యనారాయణ లక్కున్నోడు చిత్రాన్ని నిర్మించగా.. అచ్చు రాజమణి సంగీతం అందించాడు. లక్కున్నోడులో మంచు విష్ణుకు జోడీగా హన్సిక మొత్వాని నటిస్తోంది. వీళ్లిద్దరూ ఇప్పటికే హిట్ పెయిర్ అనిపించేసుకోవడంతో.. లక్కున్నోడికి లక్కు బాగానే కలిసొచ్చేట్లుగానే ఉంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/