Begin typing your search above and press return to search.
ఎన్నికల అధికారికి మంచు విష్ణు తాజా లేఖ
By: Tupaki Desk | 5 Oct 2021 7:00 AM GMT`మా` ఎన్నికల పర్వం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతూ సాధారణ ఎన్నికల వాతారణాన్ని తలపిస్తోంది. ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్.. మంచు విష్ణు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి ప్రకాష్‌రాజ్.. మంచు విష్ణు పోటీపడుతున్నారు. మాజీ అధ్యక్షుడు నరేష్ .. మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణుకు అండగా నిలుస్తూ ప్రకాష్‌రాజ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో రాజకీయాలు వేడెక్కాయి. మంచు విష్ణు .. నరేష్.. మోహన్ బాబులపై ప్రకాష్ రాజ్ విమర్శలు చేసి వార్తల్లో నిలిస్తే అంతే ఘాటుగా అతనిపై మంచు విష్ణు.. నరేష్ విమర్శలకు దిగుతూ `మా` ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు ఎన్నికల అదికారికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
ఈ నెల 10వ తేదీని జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్తు ఉపయోగించాలని అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో `మా `ఎన్నికల పర్వం మరో మలుపు తిరుగుతోంది. ఈవీఎంల పనితీరుపై తమకు నమ్మకం లేదని.. బ్యాలెట్ పేపర్‌ని మాత్రమే అనుమతించాలని మంచు విష్ణు కోరుతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఈవీఎంలని మాత్రమే ఎన్నికలకు ఉపయోగించాలని చెబుతున్నారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగించారని అదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ ఈవీఎంలనే ఉపయోగించాలని ప్రకాష్ రాజ్ పట్టుబడుతున్నారు. అయితే ఈవీఎంలు ఉపయోగించినందుకు సరైన చెల్లింపులు చేయని కారణంగా ఈసీఐఎల్ సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈసారి ఎన్నికల కోసం ఈవీఎంలు ఏర్పాటు చేయాలంటూ ఈసీఐఎల్ కు `మా` తరుపున లేఖ రాసినట్టుగా తెలిసింది. అయితే దీనిపై ఎన్నికల అధికారి తుది నిర్ణయం తీసుకోనున్నారు.