Begin typing your search above and press return to search.
లక్కున్నోడు.. ఎన్ని నోట్ల కట్టలో?
By: Tupaki Desk | 5 Nov 2016 5:43 AM GMTమంచు విష్ణు ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ ఎదర్కున్నాడు కానీ.. ఈ ఏడాది ఫామ్ లోకి వచ్చేశాడు. ఈడో రకం ఆడో రకంలో కామెడీ టైమింగ్ తో ఇరగదీసేసి హిట్ కొట్టేశాడు విష్ణు. ఆ తర్వాత వరుసగా సినిమాలు ప్లాన్ చేసినా.. కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు లక్కున్నోడుగా వస్తున్నాడు మంచు విష్ణు.
ఇప్పటికే లక్కున్నోడు ప్రీ లుక్ రిలీజ్ కాగా.. కేవలం కళ్లజోడు పెట్టుకున్న విష్ణు ఫేస్ ని బాగా క్లోజ్ నుంచి చూపించారంతే. కళ్లజోడు అద్దాల్లో డబ్బుల కట్టలు.. ఫ్రేమ్ పై డైమండ్స్ తో మెరిసిపోతున్న బంగారంతో చేసిన రూపాయి సింబల్ ను చూస్తుంటే.. ఈ మూవీలో హీరో పాత్ర డబ్బు చుట్టూ తిరిగే రోల్ అని అర్ధం చేసుకోవచ్చు. నవంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు లక్కున్నోడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది.
లక్కున్నోడులో హన్సిక మొత్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దేనికైనా రెడీ.. పాండవులు పాండవులు తుమ్మెదా తర్వాత.. మంచు విష్ణు-హన్సికలు కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గీతాంజలి.. త్రిపుర వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్.. లక్కున్నోడిని తెరకెక్కిస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/