Begin typing your search above and press return to search.
మంచు విష్ణు మళ్లీ ఆ డైరెక్టరుతో..
By: Tupaki Desk | 19 Sep 2015 6:49 AM GMTఎర్రబస్సు - డైనమట్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచినా మంచు విష్ణు జోరు ఏమాత్రం తగ్గించట్లేదు. ఈ మధ్యే ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సోనారికా హీరోయిన్ గా విష్ణు ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడింకో సినిమాకు పచ్చజెండా ఊపాడు మంచు కథానాయకుడు. తమ ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో విష్ణు ఓ సినిమా చేయబోతున్నాడు. విష్ణు వరుస ఫ్లాపుల్లో ఉండగా అతడికి సక్సెస్ రుచి చూపించింది నాగేశ్వరరెడ్డే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దేనికైనా రెడీ’ మంచి విజయం సాధించింది. దీని తర్వాత మంచు మనోజ్ ను ‘కరెంటు తీగ’గా చూపించి మరో హిట్టు ఇచ్చాడు నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు మళ్లీ విష్ణుతో జత కడుతున్నాడు.
అనిల్ సుంకర ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం. విష్ణు, నాగేశ్వరరెడ్డిలతో అనిల్ కు ఇదే తొలి సినిమా. ఎక్కువగా సొంత బేనర్ లోనే సినిమాలు చేసే విష్ణు ప్రస్తుతం చేస్తున్న రెండు ప్రాజెక్టులూ బయటి బేనర్ లలోనే కావడం విశేషం. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా దేనికైనా రెడీ తరహాలోనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఎర్రబస్సులో సెంటిమెంటును - డైనమైట్ లో యాక్షన్ ను నమ్ముకుని బోల్తా కొట్టాడు విష్ణు. అందుకే తనకు కలిసొచ్చిన ఎంటర్ టైన్ మెంట్ ఫార్ములానే నమ్ముకోబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా విష్ణుకు మరో మూడు కమిట్ మెంట్ లున్నాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ‘కన్నప్ప’తో పాటు హనుమంతుడి జీవిత కథతో ఓ సినిమా, ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా చేయాల్సి ఉంది.